Aadhaar Card: నవంబర్ 1 నుంచి ఆధార్ సెంటర్ తో పని లేకుండా ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్.!
నవంబర్ 1 నుంచి ఆధార్ సెంటర్ తో పని లేకుండా ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్
నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త విధానం
యూజర్లు సులభంగా వారి వివరాలు అప్డేట్ చేసుకునే విధంగా డిజిటల్ శకానికి UIDAI నాంది పలికింది
Aadhaar Card: నవంబర్ 1 నుంచి ఆధార్ సెంటర్ తో పని లేకుండా ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ చేసే విధానాన్ని అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త విధానం తో ఆధార్ కార్డు కలిగిన యూజర్లు సొంతంగా కొన్ని వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఒకప్పుడు చిన్న అప్డేట్ కోసం కూడా ఆధార్ సెంటర్ వద్ద గంటల తరబడి పడిగాపులు కాసేవారు. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా యూజర్లు సులభంగా వారి వివరాలు అప్డేట్ చేసుకునే విధంగా డిజిటల్ శకానికి కొత్త విధానంతో UIDAI నాంది పలికింది.
SurveyAadhaar Card: ఏమిటి కొత్త విధానం?
UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానంతో ఆధార్ హోల్డర్స్ కి మరింత సౌలభ్యం, భద్రత మరియు డిజిటల్ సౌకర్యం కల్పించనున్నారు. ఇందులో ప్రధానమైనది ‘ఇంటి నుంచి ఆధార్ అప్‌డేట్ సదుపాయం’. ఈ కొత్త విధానం ద్వారా ఆధార్ కార్డు కలిగిన వారు ఆదార్ సెంటర్ కి వెళ్లకుండానే వారి ఆధార్ కార్డులో పేరు, చిరునామా, జన్మతేదీ, లింగం, మొబైల్ నెంబర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకునే సదుపాయం లభిస్తుంది.
ఈ కొత్త విధానం ద్వారా ‘పేపర్ లెస్ గవర్నెన్స్’ వైపుగా బాటలు వేయడానికి UIDAI పూనుకుంది. అంతేకాదు, ప్రజలు మరింత సులభమైన ఆన్‌లైన్ మార్గాలు వైపుగా మళ్లించడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు, UIDAI ఈ ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయడం ద్వారా ప్రజల విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది.

ఇది కాకుండా ప్రస్తుతం నడుస్తున్న మాన్యువల్ వెరిఫికేషన్ స్థానంలో కొత్తగా ఆటోమేటిక్ వెరిఫికేషన్ వచ్చి చేరుతుంది. ఆధార్ లో ఏమైనా తప్పులు ఉంటే ఇప్పటికే గవర్నమెంట్ డేటా బేస్ లో కొనసాగుతున్న ఇతర పాత్రలతో ఆధార్ స్వయంగా సరిపోల్చుకుంటుంది. అంటే, పాస్‌పోర్ట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ డేటా బేస్ లతో ఆధార్ స్వయంగా సవివరాలు చెక్ చేసుకుంటుంది. అయితే, కొత్త సౌలభ్యాలను తెచ్చిన UIDAI కొత్త ఫీజు కూడా అమలు చేస్తుంది.
Also Read: Jio Google: జియో యూజర్లకు 35 వేల విలువైన Gemini Pro AI ఉచితంగా ప్రకటించింది.!
ఏమిటా కొత్త ఫీజులు?
ఆధార్ అప్డేట్ కోసం UIDAI కొత్తగా ప్రకటించిన రేట్లు విషయానికి వస్తే, డెమోగ్రాఫిక్ అప్‌డేట్ (పేరు, చిరునామా మొదలైనవి) అప్డేట్ కోసం నవంబర్ 1వ తేదీ నుంచి రూ. 75 వసూలు చేస్తుంది. అలాగే, బయోమెట్రిక్ అప్‌డేట్ (ఫింగర్‌ప్రింట్, ఐరిస్, ఫోటో) వంటి వాటి కోసం వచ్చే నెల నుంచి రూ. 125 చెల్లించాల్సి వస్తుంది. అయితే, పిల్లల కోసం వయసు కోసం చేసే ఆధార్ అప్డేట్ ని మాత్రం ఉచితంగానే ఆఫర్ చేస్తుంది.
మొత్తానికి ఇది డిజిటల్ ఇండియా 2.0 వైపు మరో పెద్ద అడుగు అవుతుంది. అంతేకాదు, ప్రభుత్వ డేటా బేస్ ల మధ్య సెక్యూర్ ఇంటర్ లింక్ వలన డూప్లికేట్ ఆధార్‌లు మరియు తప్పుడు అప్‌డేట్‌లు కూడా బాగా తగ్గడానికి సహకరిస్తుంది.