జియో 5G స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వస్తుందో చెబుతున్న రూమర్లు

HIGHLIGHTS

5G స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే పనిలో Jio

గూగుల్ పార్ట్నర్ షిప్ తో కొత్త JIO 5G స్మార్ట్ ఫోన్

త్వరలోనే జియో 5G స్మార్ట్ ఫోన్

జియో 5G స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వస్తుందో చెబుతున్న రూమర్లు

జియో 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగు పెట్టె అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఆన్లైన్లో వచ్చిన కథనాల ప్రకారం 5G స్మార్ట్ ఫోన్ ను అతి త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టడానికి జియో ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.  RIL యొక్క 2021 AGM నుండి 5G స్మార్ట్ ఫోన్  మరియు సరసమైన ల్యాప్ టాప్ ని లాంచ్ చేస్తుందని ఎకనామిక్ టైమ్స్ తన కొత్త నివేదికలో హైలైట్ చేసి చెప్పింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ నివేదిక ప్రకారం, ప్రజలకు అనువుగా వుండేలా జియో తన 5G స్మార్ట్ ఫోన్ ను తయారు చేసే పనిలో వుందని తెలిపింది. అంతేకాదు, ఈ కొత్త JIO  5G స్మార్ట్ ఫోన్ గూగుల్ పార్ట్నర్ షిప్ తో తీసుకువస్తుందని కూడా తెలుస్తోంది. 2021 రెండవ అర్ధభాగంలో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుందని కూడా తెలిపింది.

ఇక ముందుగా వచ్చిన రూమర్ల నుండి జియో సంస్థ 5G స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చెయ్యవచ్చని, ఈ జియో 5G స్మార్ట్ ఫోన్ భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ధరను మాత్రం కేవలం 2,500 నుండి 3,000 రుపాయల పరిధిలో ఉంచవచ్చని అంచనా వేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని జియో సంస్థకి చెందిన ఒక ప్రముఖ అధికారి బయటపెట్టినట్లు కూడా తెలిపారు.

అయితే, ఇవన్నీ కూడా అంచనాలు మరియు రూమర్లు మాత్రమే. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తిగా ఒక అవహగాహన లోకి రాలేము.      

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo