Flipkart Quick Delivery సర్వీస్ లాంచ్ : ఏ వస్తువైనా 90 నిముషాల్లో డెలివరీ

HIGHLIGHTS

Flipakrt Quick Delivery సర్వీస్ ను 90 మినిట్ డెలివరీ సర్వీస్ గా బెంగళూరులో ప్రారంభించింది.

Flipkart Quick ద్వారా, మీరు ఫ్లిప్ ‌కార్ట్ నుండి కేవలం 90 నిమిషాల్లోనే మీకు కావల్సిన వాటిని డెలివరీ పొందుతారు.

Flipakrt Quick Delivery సర్వీస్ ను అమెజాన్ యొక్క 'Prime Now 'కి గట్టి పోటీనిచ్చేందుకు, ఫ్లిప్ ‌కార్ట్ ప్రవేశపెట్టినట్లు చెప్పకనే చెబుతోంది.

Flipkart Quick Delivery సర్వీస్ లాంచ్ : ఏ వస్తువైనా 90 నిముషాల్లో డెలివరీ

Flipkart Quick Delivery సర్వీస్ ను 90 మినిట్ డెలివరీ సర్వీస్ గా బెంగళూరులో ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా, మీరు ఫ్లిప్ ‌కార్ట్ నుండి కేవలం 90 నిమిషాల్లోనే మీకు కావల్సిన వాటిని డెలివరీ పొందుతారు. మీరు మీ డెలివరీని ఉదయం 6 నుండి అర్ధరాత్రి వరకు 2 గంటల వ్యవధిలో షెడ్యూల్ చేయవచ్చు. అలాగే, ఫ్లిప్‌ కార్ట్ యొక్క ఈ కొత్త స్పీడ్ సర్విస్ పైన మినిమమ్ డెలివరీ ఛార్జీగా రూ .29 వసూలు చేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ ‌కార్ట్ తన Hyper Local Delivery Service ను బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. లోకల్ హబ్స్  నుండి 90 నిమిషాల లోపలే ప్రోడక్ట్స్ డెలివరీ చేస్తామని, వీటిలో 2000 వరకు ప్రోడక్ట్స్ లిస్టులో చేర్చినట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది మరియు ఈ సర్వీస్ ను 'Flipkart Quick'  క్విక్‌గా ప్రారంభించారు. అమెజాన్ యొక్క 'Prime Now 'కి గట్టి పోటీనిచ్చేందుకు ఈ సర్వీస్ ను ఫ్లిప్ ‌కార్ట్ ప్రవేశపెట్టినట్లు చెప్పకనే చెబుతోంది. అమెజాన్ సర్వీస్ మీకు 2 గంటల్లో కొత్త ప్రోడక్ట్స్ ని డెలివరీ అందిస్తుంది.

ఈ సర్వీస్ లో ముందుగా కిరాణా, పాలు మరియు నాన్-వెజ్ ఉత్పత్తులు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లు, స్టేషనరీ వస్తువులు మరియు హోమ్ నీడ్స్ వస్తువులు వంటి కేటగిరీలు ఉన్నాయి. ఫ్లిప్‌ కార్ట్ కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చిన 90 నిమిషాల్లో ప్రోడక్ట్ ని పొందవచ్చు లేదా వారి సౌలభ్యం ప్రకారం 2 గంటల స్లాట్ ‌ను ఎంచుకోవచ్చు. ఈ క్విక్ డెలివరీ సర్వీస్ ఉదయం 6 నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంది మరియు దీని కోసం మినిమమ్ 29 రూపాయల రుసుము చెల్లించవలసి వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile