క్రిములను నశింపచేసే Anti-Bacterial LED గురించి తెలుసా?

క్రిములను నశింపచేసే Anti-Bacterial LED గురించి తెలుసా?

ఇటీవల, LED లైట్ టెక్నాలజీలో అత్యంత ప్రాచూర్యం పొందిన, Syska మైక్రోబయాల్ డిసిన్ఫెకషన్ లక్షణాలను కలిగి, విద్యుత్ ద్వారా గదిలోని హానికరమైన బాక్టీరియాను నశింపచేసే సరికొత్త బ్యాక్టీగ్లో SSK-BAB-9W  Anti-Bacterial LED బల్బును తీసుకొచ్చింది. ఈ బల్బు, 400nm నుండి 420nm  తరంగ ధైర్ఘ్యము ( wavelength) ను విడుదల చేస్తుంది మరియు  ఇది మనుష్యులకు ఎటువంటి హాని కలిగించదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 హానికరమైన బాక్టీరియాను ఎదుర్కోవడానికి మరియు విస్తరించకుండా నిరోధించాడనికి సాంకేతిక పరంగా తీసుకొచ్చిన వాటిలో, అత్యాధునిక టెక్నజితో నిర్మించిన ఈ బ్యాక్టీగ్లో Anti-Bacterial LED బల్బును కూడా ఒక ప్రధానమైనదానిగా చెప్పవచ్చు. దీన్ని ఈ గదిలోనైతే ఉంచుతారో, ఆ గదిలో వున్న చాలా రకాలైన హానికారక బ్యక్టీరియాలను దాదాపుగా నశింపచేస్తుంది.

అలాగే, ఈ బ్యాక్టీగ్లో LED బల్బ్ 2-ఇన్-1 మోడ్ తో వస్తుంది. దీన్ని మీరు లైట్ ప్లస్ యాంటీ-బ్యాక్టీరియల్ మోడ్ లేదా కేవలం యాంటీ బ్యాక్టీరియల్ మోడ్ తో ఎంచుకునేలా వస్తుంది.  ఈ ప్రత్యేకమైన , యాంటీ-బ్యాక్టీరియల్ బల్బ్ కేవలం 250/- రుపాయల ఆకర్షణీయమైన ధరతో విడుదల చెయ్యబడింది. అలాగే, ఈ LED బల్బ్ దేశవ్యాప్తంగా వున్న ప్రధానమైన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది మరియు ఈ LED బల్బ్ 1 సంవత్సరం వారంటీతో పాటుగా వస్తుంది.                                

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile