ఫ్లోర్ స్టాండ్ తో కొత్త బడ్జెట్ 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసిన Zebronics
Zebronics ఇప్పుడు ఫ్లోర్ స్టాండ్ తో కొత్త బడ్జెట్ 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసింది
రియర్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరింత అనువుగా మరియు సమర్ధవంతంగా ఉంటుంది
సినిమా థియేటర్ వంటి సౌండ్ అందించే డాల్బీ సరౌండ్ సౌండ్ తో అందించింది
ఇండియాలో బడ్జెట్ ధరలో కూడా మంచి సౌండ్ బార్స్ అందించిన Zebronics ఇప్పుడు ఫ్లోర్ స్టాండ్ తో కొత్త బడ్జెట్ 5.1 Dolby సౌండ్ బార్ లాంచ్ చేసింది. రియర్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరింత అనువుగా మరియయు సమర్ధవంతంగా ఉండేలా ఈ కొత్త స్టాండ్ సెటప్ సహాయపడుతుంది. ఈ సౌండ్ బార్ రూమ్ మొత్తం సౌండ్ తో నింపే సౌండ్ అవుట్ పుట్ మరియు సినిమా థియేటర్ వంటి సౌండ్ అందించే డాల్బీ సరౌండ్ సౌండ్ తో అందించింది.
SurveyZebronics 5.1 Dolby సౌండ్ బార్ : ప్రైస్
జెబ్రోనిక్స్ ఈ కొత్త సౌండ్ బార్ Juke BAR 9535 ను రూ. 13,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల ICICI మరియు SBI క్రెడిట్ కార్డు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Pixel Android 17: పిక్సెల్ ఫోన్ ఉన్న వారికి గుడ్ న్యూస్ అందించిన గూగుల్.!
Zebronics 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఇక ఈ లేటెస్ట్ జెబ్రోనిక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ కొత్త డిజైన్ మరియు రియర్ స్పీకర్ కోసం ప్రత్యేమైన రియర్ స్పీకర్ స్టాండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో మూడు పవర్ ఫుల్ స్పీకర్ కలిగిన బార్, స్టాండ్ సమేతంగా వచ్చే డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్ మరియు డీప్ బాస్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 525W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్ ఇన్, HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ వాల్యూమ్ మరియు మీడియా కంట్రోల్ బటన్స్ కలిగి ఉంటుంది.
అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో మంచి ఫంక్షనల్ రిమోట్ కూడా వస్తుంది. ఇది 20000 KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మరియు 20 Ohms ఇంపెడెన్స్ వంటి ఫీచర్స్ తో మంచి డీప్ అండ్ రియలిస్టిక్ సౌండ్ అందిస్తుందని జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ గురించి పేర్కొంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
