99 గంటల ప్లే టైమ్ తో కొత్త Neckband లాంచ్ చేసిన Unix

HIGHLIGHTS

Unix ఇండియా కొత్తగా Neckband ను లాంచ్ చేసింది

యునిక్స్ ఇప్పుడు Notes సిరీస్ ను కూడా పరిచయం చేసింది

ఈ నెక్ బ్యాండ్ 99 గంటల భారీ ప్లే టైమ్ అందిస్తుంది

99 గంటల ప్లే టైమ్ తో కొత్త Neckband లాంచ్ చేసిన Unix

Unix ఇండియా కొత్తగా Neckband ను లాంచ్ చేసింది. ఇప్పటికే చాలా నెక్ బ్యాండ్ మోడల్స్ అందించిన యునిక్స్ ఇప్పుడు Notes సిరీస్ ను కూడా పరిచయం చేసింది. నోట్స్ (UX-W400) మోడల్ నెంబర్ ఈ నెక్ బ్యాండ్ ను పరిచయం చేసింది. ఈ నెక్ బ్యాండ్ 99 గంటల భారీ ప్లే టైమ్ మరియు 2500 గంటల స్టాండ్ బై టైమ్ తో లాంగ్ లాస్టింగ్ గా ఉంటుందని కంపెనీ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Unix Neckband

నోట్స్ (UX-W400) పేరుతో వచ్చిన ఈ నెక్ బ్యాండ్ ను విడుదల చేసింది. ఈ నెక్ బ్యాండ్ 11mm స్పీకర్స్ ను కలిగి ఉంటుంది మరియు ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ కూడా ఉంటుంది. ఈ నెక్ బ్యాండ్ లో 350mAh లిథియం అయాన్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీ సహాయంతో ఈ నెక్ బ్యాండ్ 2500 గంటల స్టాండ్ బై లేదా 99 గంటల ప్లే టైమ్ అందిస్తుందని యునిక్స్ తెలిపింది.

Unix Neckband

ఇక సౌండ్ ఫీచర్స్ లోకి వెళితే, ఈ నెక్ బ్యాండ్ హై ఫెడిలిటీ HD సౌండ్ అందిస్తుందని యునిక్స్ తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఈ నెక్ బ్యాండ్ 5 ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది మరియు యూజర్ కు నచ్చినట్లుగా సౌండ్ సెట్ చేసుకునే కష్టమైజబుల్ ఈక్వలైజర్ సెట్టింగ్ ను కూడా యూనిక్స్ అందించింది.

యునిక్స్ ఈ కొత్త నెక్ బ్యాండ్ ను వాయిస్ అసిస్టెంట్ అందించింది. ఈ నెక్ బ్యాండ్ ను యాంటీ స్లిప్ సిలికాన్ ఫ్లెక్సీ బిల్ ఫిట్ తో అందించినట్లు యునిక్స్ తెలిపింది. ఈ యునిక్స్ నెక్ బ్యాండ్ నానో కోటింగ్ తో రైన్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ నెక్ బ్యాంక్ ను బ్లూ, గ్రీన్ మరియు బ్లాక్ మూడు కలర్ ఆప్షన్ లలో యునిక్స్ అందించింది.

Also Read: vivo X200 Series గ్లోబల్ లాంచ్ ప్రకటించిన కంపెనీ: ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే.!

యునిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ నెక్ బ్యాండ్ డైలీ యూసేజ్ కు తగిన బ్యాటరీ మరియు ఫీచర్స్ ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఈ నెక్ బ్యాండ్ రిటైల్ స్టోర్ మరియు యునిక్స్ అధికారిక సైట్ నుంచి లభిస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile