todays best Dolby Atmos soundbar option under rs 7000
ప్రస్తుతం సౌండ్ బార్ రేట్లు చాలా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ లు కూడా చాలా చవక ధరలో లభించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, ఒకప్పుడు కేవలం ప్రీమియం సెగ్మెంట్ కోసం మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. అయితే, ఇప్పుడు బడ్జెట్ ధరలో కూడా ఈ సౌండ్ బార్ లు లభిస్తున్నాయి. అండర్ రూ. 7,000 బడ్జెట్ లో Dolby Atmos సౌండ్ బార్ కోరుకునే వారి కోసం ఈరోజు అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్ అందిస్తున్నాము.
జెబ్రోనిక్స్ యొక్క డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Juke BAR 3850 Pro ఈరోజు లభిస్తున్న బెస్ట్ అండర్ రూ. 7,000 బడ్జెట్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ 10 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన 69% గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 8,103 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
అలాగే, ఈ సౌండ్ బార్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా నుండి ఐసీఐసీఐ, యాక్సిస్ మరియు SBI క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 810 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు మీకు కేవలం రూ. 7,293 రూపాయల చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Vivo T5 5G: వివో టి సిరీస్ అప్ కమింగ్ ఫోన్ అదిరింది.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో సపరేట్ సబ్ ఉఫర్ లేదా శాటిలైట్ స్పీకర్లు ఉండవు. ఇది కేవలం బార్ మాత్రమే వస్తుంది మరియు టోటల్ 170W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అయితే, ఇంటిని షేక్ చేసే భారీ బాస్ సౌండ్ కోరుకుంటే మాత్రం ఇది మీకు తగిన సౌండ్ బార్ కాదు. ఇందులో పైన రెండు మరియు ముందు 4 స్పీకర్లతో మొత్తం 6 స్పీకర్లు ఉంటాయి. ఇది టేబుల్ పైన మరియు గోడకు తగిలించుకునే ఫీచర్ తో కూడా వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఇది డాల్బీ అట్మోస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మంచి సరౌండ్ అండ్ 3D సౌండ్ ని ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, HDMI ఇన్ అండ్ HDMI అవుట్ తో మొత్తం మూడు HDMI పోర్ట్ లు కలిగి ఉంటుంది. అలాగే, ఆప్టికల్ ఇన్, USB, బ్లూటూత్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.