Soundbar Buying Guide to select best soundbar for your home
Soundbar Buying Guide: OTT యాప్స్ లో గొప్ప క్వాలిటీ తో సినిమాలు మరియు సిరీస్ లు రావటం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది టీవీ తో జతగా సౌండ్ బార్ కూడా కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే, టీవీలో పిక్చర్ క్వాలిటీ ఎంత బాగున్నా ఆడియో క్వాలిటీ అంత పవర్ ఫుల్ గా ఉండకపోవడమే ఇందుకు కారణం. అదే టీవీకి తగిన మంచి సౌండ్ బార్ ఉంటే మూవీస్, మ్యూజిక్ మరియు గేమింగ్ అనుభూతి సైతం పూర్తిగా మారిపోతుంది. కానీ, మార్కెట్లో ఎన్నో రకాల సౌండ్ బార్ లు ఉండటంతో ఏది కొనాలి అనే విషయం చాలా మందికి కన్ ఫ్యూజ్ గా ఉంటుంది. అందుకే, మీకు తగిన బెస్ట్ సౌండ్ బార్ ఎంచుకోవడానికి తగిన సింపుల్ బైయింగ్ గైడ్ అందించాము.
మొదటగా మీరు సౌండ్ బార్ కోసం ఎంచుకునే రూమ్ సైజు ను గుర్తించాలి. చిన్న గదికి బేసిక్ 2.1 ఛానల్ సౌండ్ బార్ సరిపోతుంది. కానీ పెద్ద హాల్ లేదా హోమ్ థియేటర్ ఫీల్ కావాలంటే 5.1 ఛానల్ లేదా Dolby Atmos సపోర్ట్ ఉన్న సౌండ్ బార్ మంచిది. సౌండ్ బార్ లో ఎక్కువ ఛానల్స్ ఉంటే సరౌండ్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ కూడా బాగా వస్తుంది.
సౌండ్ బార్ ఎంపిక కోసం రెండవ ముఖ్యమైన విషయం సౌండ్ అవుట్ పుట్. ఇది వాట్స్ (Watts) లో ఉంటుంది. సాధారణ బెడ్ రూమ్ కోసం 80W నుంచి 150W సౌండ్ బార్ సరిపోతుంది. అదే పెద్ద రూమ్ లేదా హాల్ కోసం అయితే 300W లేదా అంతకంటే ఎక్కువ పవర్ ఉన్న సౌండ్ బార్ తీసుకోవడం మంచిది.
ఒక సౌండ్ బార్ లో సబ్ ఉఫర్ చాలా ముఖ్యం. ఇది అదరగొట్టే బాస్ సౌండ్ కోసం ఉపయోగపడుతుంది. యాక్షన్ మూవీస్ లేదా మ్యూజిక్ ని ఎక్కువగా ఇష్టపడే వారు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉన్న సౌండ్ బార్ తీసుకుంటే పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. రియర్ స్పీకర్ తో వచ్చే సౌండ్ బార్ స్మార్ట్ టీవీలో కంటెంట్ కు ప్రాణం పోస్తుంది.
ఇప్పుడు చాలా సౌండ్ బార్ లలో Dolby Atmos మరియు DTS:X వంటి చాలా అడ్వాన్స్డ్ సౌండ్ టెక్నాలజీ అందిస్తున్నారు. ఇవి సినిమా థియేటర్ లాంటి 3D సరౌండ్ ఆడియో ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. OTT ప్లాట్ ఫామ్ ఎక్కువగా చూసే వారికి ఇది మంచి ఫీచర్ అవుతుంది.
Also Read: Realme 16T 5G: భారీ 8000 mAh బ్యాటరీ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది.!
సౌండ్ బార్ లో ఉండే కనెక్టివిటీ ఆప్షన్ కూడా చూసుకోవాలి. సౌండ్ బార్ లో HDMI ARC/eARC సపోర్ట్ ఉంటే టీవీ తో చాలా సులభంగా కనెక్ట్ చేయవచ్చు. అదనంగా బ్లూటూత్, USB, ఆప్టికల్, Wi-Fi సపోర్ట్ ఉంటే మొబైల్, ల్యాప్ టాప్ మరియు గేమింగ్ కన్సోల్ వంటి డివైజెస్ కు కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
సౌండ్ బార్ కొనాలంటే బడ్జెట్ కూడా ముఖ్యమే. రూ. 5,000 లో బేసిక్ సౌండ్ బార్ లు లభిస్తాయి. అయితే, రూ. 10,000 నుంచి రూ. 25,000 మధ్య రేంజ్ మోడల్స్ మంచి ఫీచర్స్ తో లభిస్తాయి. ప్రీమియం సౌండ్ అందించే సౌండ్ బార్ కావాలంటే కనీసం రూ. 50,000 రూపాయలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది.