Realme 16T 5G: భారీ 8000 mAh బ్యాటరీ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది.!

Realme 16T 5G: భారీ 8000 mAh బ్యాటరీ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది.!

Realme 16T 5G: రియల్ మీ ఈరోజు 16 సిరీస్ నుంచి 16T స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ 8000 mAh బ్యాటరీ మరియు Sony కెమెరాతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను సెల్ఫీ మిర్రర్ ఫీచర్ తో లంచ్ చేసింది మరియు ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ గా రియల్ మీ 16 టి వచ్చింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 16T 5G: ప్రైస్

రియల్ మీ 16 టి స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మొత్తం మూడు వేరియంట్స్ లో రియల్ మీ లాంచ్ చేసింది.

  • రియల్ మీ 16 టి (6GB + 128GB) ప్రైస్ : రూ. 29,999
  • రియల్ మీ 16 టి (8GB + 128GB) ప్రైస్ : రూ. 31,999
  • రియల్ మీ 16 టి (8GB + 256GB) ప్రైస్ : రూ. 34,999

ఈ ఫోన్ అరోరా గ్రీన్, స్టార్ లైట్ బ్లాక్ మరియు స్టార్ లైట్ రెడ్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే, మీ 26 వ తేదీ నుంచి ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి లభిస్తుంది.

ఆఫర్స్

రియల్ మీ 16 టి స్మార్ట్ ఫోన్ పై తగిన లాంచ్ ఆఫర్స్ కూడా కంపెనీ జత చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, రూ. 5,000 రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది. ఇది కాకుండా రియల్ మీ ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల ప్రత్యేకమైన లోయల్ బోనస్ కూడా లభిస్తుంది.

Also Read: Matrix సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో మూడు కొత్త QLED Smart Tv లు లాంచ్ చేసిన Kodak

Realme 16T 5G : ఫీచర్స్

ఈ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. అయితే, ఈ స్క్రీన్ కేవలం HD+ రిజల్యూషన్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ HBM బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ రియల్ మీ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

రియల్ మీ 16 టి ఫోన్ లో 50MP మెయిన్ మరియు 50MP సెకండరీ కీంర్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 1080 (FHD) వీడియో రికార్డింగ్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మాత్రం 7 సంవత్సరాల లాంగ్ లైఫ్ కలిగిన 8000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile