Samsung Galaxy Buds 3 Pro ఇయర్ బడ్స్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ప్రీమియం ధరలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ శాంసంగ్ ప్రీమియం బడ్స్ ఇప్పుడు అమెజాన్ దివాళి స్పెషల్ సేల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా చవక ధరలో లభిస్తుంది. మరి అమెజాన్ అందించిన ఈ జబర్దస్ డీల్ వివరాలు తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy Buds 3 Pro : డీల్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ అందించింది. అదేమిటంటే, ఇండియన్ మార్కెట్లో రూ. 19,999 ధరతో విడుదలైన ఈ శాంసంగ్ ప్రీమియం ఇయర్ బడ్స్ రూ. 8000 డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఎలాగంటే, అమెజాన్ బడ్స్ పై రూ. 2,000 డిస్కౌంట్ మరియు రూ. 6,000 ఆల్ బ్యాంక్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది.
ఈ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ సరికొత్త ఐకానిక్ బ్లేడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ ఆప్టిమల్ కంఫర్ట్ కోసం 3D ఇయర్ డేటా అండ్ సిమ్యులేషన్ తో ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ప్రీమియం మరియు స్టూడియో క్వాలిటీ Hi-Fi AUDIO అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ 24bit / 96kHz సపోర్ట్ కలిగిన టు వే స్పీకర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, సుపీరియర్ క్వాలిటీ అండ్ లీనమయ్యే సౌండ్ కోసం ఇందులో డ్యూయల్ ఆంప్ కూడా అందించింది.
ఈ ఇయర్ బడ్స్ మాటి మాటికి సర్దుకునే అవకాశం లేకుండా పిచ్ పర్ఫెక్ట్ సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అడాప్టివ్ నోయిస్ కంట్రోల్, యాంబియంట్ సౌండ్ మరియు అడాప్టివ్ ఈక్వలైజర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది మరియు IP57 డ్యూరాబిలిటీ కూడా కలిగి ఉంటుంది.
ఈ శాంసంగ్ ప్రీమియం ఇయర్ బడ్స్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో లభిస్తుంది. ప్రీమియం బడ్స్ ని బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది.