Realme Buds T300: మార్చి 19వ తారీఖున కొత్త ప్రోడక్ట్స్ ను లాంఛ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది రియల్ మి. ఈ ఈవెంట్ నుండి రియల్ మి నార్జో 70 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మరియు రియల్ మి బడ్స్ టి 300 కొత్త కలర్ వేరియంట్ లను లాంఛ్ చేయబోతున్నట్లు రియల్ మి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను కొత్త కలర్ మరియు 30DB ANC తీసుకు వస్తున్నట్లు రియల్ మి తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
Realme Buds T300:
రియల్ మి బడ్స్ టి 300 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను కొత్త డోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్ తో తీసుకు వస్తున్నట్లు రియల్ మి టీజింగ్ చేస్తోంది. మార్చి 19న జరగనున్న లాంఛ్ ఈవెంట్ నుండి కొత్త 5జి స్మార్ట్ ఫోన్ మరియు బడ్స్ ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ప్రోడక్ట్స్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది. ఈ పేజ్ నుండి ఈ రెండు ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకతలతో టీజింగ్ కూడా స్టార్ట్ చేసింది.
రియల్ మి బడ్స్ టి 300 ఇయర్ బడ్స్ లో 360° స్పెటియల్ ఆడియో ఫీచర్ ని కలిగి ఉంటుంది. ఈ బడ్స్ యొక్క కొత్త వేరియంట్ ఫీచర్స్ ఇంకా ప్రకటించ లేదు. కానీ, రియల్ మి బడ్స్ టి 300 బడ్స్ ను Dolby Atmos సౌండ్ సపోర్ట్ అందించింది. ఈ బడ్స్ Dynamic Bass Boost స్పీకర్లు మరియు IP55 డస్ట్ & వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ తో కూడా అందించింది.
ఇటీవల వచ్చిన ఈ రియల్ మి బడ్స్ టోటల్ (బాక్స్ తో కలిపి) 40 గంటల లాంగ్ ప్లేబ్యాక్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అయితే, కొత్తగా లాంఛ్ చేయబోతున్న ఈ బడ్స్ కూడా అదే ఫీచర్స్ ను కలిగి ఉంటుందా లేక ఇంకేదైనా మార్పులు ఉంటాయో చూడాలి.