Rakhi 2026 best earbuds gift options under budget price
Rakhi 2026: రాఖీ పండుగ కానుకగా బడ్జెట్ ఇయర్ బడ్స్ గిఫ్ట్ కోసం సెర్చ్ చేస్తున్నారా, అయితే ఈ రోజు మీకు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ప్రైస్ మొదలుకొని ప్రీమియం ధర వరకు మంచి ఇయర్ బడ్స్ మీకు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక మంచి డీల్ ని ఎంచుకొని రాఖీ పండుగ కానుకగా మీ తోబుట్టువుకి గిఫ్ట్ చేయవచ్చు. బడ్జెట్ ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ఈ రోజు చూద్దాం.
ఈరోజు మూడు బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఇందులో రియల్ మీ, వన్ ప్లస్ మరియు ఒప్పో లేటెస్ట్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఆ డీల్స్ ఏమిటో చూసేద్దామా.
ఇది ఒప్పో రీసెంట్ గా విడుదల చేసిన బెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ సెట్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 1,599 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ 12.4mm బిగ్ స్పీకర్ తో డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది. అలాగే, డ్యూయల్ మైక్రోఫోన్ తో మంచి కాలింగ్ సౌకర్యం కూడా అందించింది. ఈ బడ్స్ 54 గంటల ప్లే టైం అందించే బిగ్ బ్యాటరీ, ఎన్కో మాస్టర్ యాప్ సపోర్ట్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్, డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది మీ తోబుట్టువుకు మీరిచ్చే గొప్ప కానుక అవుతుంది.
ఇది రియల్ మీ అందించిన లేటెస్ట్ ఇయర్ బడ్స్ సెట్ మరియు ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 1,571 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ రియల్ మీ బడ్స్ బడ్జెట్ ధరలో 25dB ANC సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఇది డైనమిక్ బాస్ అందించే 12.4mm స్పీకర్లు, క్వాడ్ మైక్ AI డీప్ కాల్ నోయిస్ క్యాన్సిలేషన్, IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ మరియు 48 గంటల లాంగ్ ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ ధరలో మంచి ధరలో వచ్చే బెస్ట్ ఇయర్ బడ్స్ ఆప్షన్ గా ఉంటుంది.
Also Read: Apple Surprise and shine Event: ఐఫోన్ 18 లాంచ్ కోసం రంగం సిద్ధం చేసిన యాపిల్.!
ఇది వన్ ప్లస్ అందించిన బెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ సెట్ మరియు ఈరోజు అమెజాన్ నుంచి రూ. 1,799 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ గొప్ప సౌండ్ అందించే 12.4mm టైటానైజ్డ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. అలాగే, 3D స్పేషియల్ ఆడియో, డ్యూయల్ డివైజ్ కనెక్ట్, లో లెటెన్సీ, మంచి కాలింగ్ సౌలభ్యం కూడా కలిగి ఉంటుంది.