సరికొత్త Magnetic బ్లూటూత్ స్పీకర్ ను లాంచ్ చేసిన Promate.!
Promate టెక్నాలజీస్ ఇండియాలో సరికొత్త సరికొత్త Magnetic బ్లూటూత్ స్పీకర్ ను లాంచ్ చేసింది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను సరికొత్త డిజైన్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే డైనమిక్ స్పీకర్ తో అందించింది. ప్రొమేట్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ కొత్త మాగ్నెటిక్ స్పీకర్ ధర మరియు ఫీచర్లు పై ఒక లుక్కేద్దామా.
SurveyPromate Magnetic Bluetooth Speaker
ప్రొమేట్ టెక్నాలజీస్ ఈరోజు కొత్త మాగ్నెటిక్ బ్లూటూత్ స్పీకర్ ను లాంచ్ చేసింది. ఈ స్పీకర్ ను రూ. 1,999 ధరతో విడుదల చేసింది. ఈ స్పీకర్ ఈరోజు నుంచి అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
ఇక ఈ కొత్త బ్లూటూత్ స్పీకర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త స్పీకర్ ను HD సౌండ్ అందించే 40mm డైనమిక్ స్పీకర్ తో అందించింది. ఈ స్పీకర్ చూడటానికి చిన్నగా కనిపించినా పవర్ ఫుల్ సలాండ్ అందిస్తుందని ప్రొమేట్ తెలిపింది.

ఈ ప్రొమేట్ కొత్త స్పీకర్ Bluetooth 5.3 తో సీఎం లెస్ కనెక్టివిటీ అందిస్తుంది. అంతేకాదు, ఇది మల్టీ ఫంక్షనల్ బటన్ మరియు మంచి బేస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్పీకర్ ఓవరాల్ గా 12 గంటల ప్లే టైం అందించే 700 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ అన్ని ఐఫోన్ లకు బాగా సరిపోయే విధంగా మేగ్ సేఫ్ సపోర్ట్ మెటల్ రింగ్ తో కూడా జతగా వస్తుంది.
Also Read: BSNL 4G: దేశవ్యాప్తంగా 35 వేల ప్రాంతాల్లో 4G సర్వీస్ అందుబాటులోకి తెచ్చిన బిఎస్ఎన్ఎల్.!
ముఖ్యంగా, ఈ స్పీకర్ ట్రూ వైర్లెస్ స్టీరియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, రెండు స్పీకర్ లను లెఫ్ట్ అండ్ రైట్ గా సెట్ చేసుకునే ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త స్పీకర్ ను మంచి కాలింగ్ ను కూడా అందిస్తుందని ప్రోమెట్ తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile