Prime Day 2026 సేల్ ఎఫెక్ట్ తో Sony Dolby సౌండ్ బార్ 7 వేలకే లభిస్తోంది.!
Prime Day 2026 సేల్ ను అమెజాన్ ఇండియా తాజాగా ప్రకటించింది
సేల్ ఎఫెక్ట్ తో ఈరోజు Sony Dolby సౌండ్ బార్ 7 వేల ధరలో లభిస్తోంది
ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించే సోనీ సౌండ్ బార్ గా నిలుస్తుంది
Prime Day 2026 సేల్ ను అమెజాన్ ఇండియా తాజాగా ప్రకటించింది. ప్రతి ఏడాది లాగే ఈ ప్రత్యేక సేల్ ను కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం మాత్రమే నిర్వహించనుంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, స్మార్ట్ గ్యాడ్జెట్స్ తో సహా వేలాది ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్లు అందించడం ఈ సేల్ ప్రత్యేకత. ఈ ఏడాది కూడా అనేక ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్ ఇప్పటికే టీజింగ్ చేస్తోంది. మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే, ప్రైమ్ డే సేల్ అధికారికంగా ప్రారంభం కాకముందే దాని ప్రభావం కనిపిస్తోంది. సేల్ కు ముందు నుంచే పలు ఉత్పత్తుల ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి. సేల్ ఎఫెక్ట్ తో ఈరోజు Sony Dolby సౌండ్ బార్ 7 వేల ధరలో లభిస్తోంది.
SurveyPrime Day 2026 : Sony Dolby సౌండ్ బార్
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ఆఫర్ ను అందించింది. ఆఫర్ ఏమిటంటే, నిన్న మొన్నటి వరకు రూ. 9,989 ధరతో సేల్ చేసిన సోనీ HT-S100F 2.0 సౌండ్ బార్ ను ఈరోజు రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 8,989 ధరతో సేల్ చేస్తోంది. అదనంగా ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ మరియు SBI అండ్ ICICI కార్డ్స్ పై 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అమెజాన్ ఈరోజు ఈ సోనీ సౌండ్ బార్ పై అందించిన ఈ మూడు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 7,090 రూపాయల బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ గొప్ప సౌండ్ అందించే సోనీ సౌండ్ బార్ గా నిలుస్తుంది. Buy From Here
Also Read: Redmi Turbo 5: రెడ్‌మీ మిడ్ రేంజ్ బీస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది.!
Sony Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
సోనీ HT-S100F 2.0 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ అనేది హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించిన ప్రీమియం ఫీచర్డ్ బడ్జెట్ సౌండ్ బార్. ఇందులో డాల్బీ డిజిటల్ ఆడియో టెక్నాలజీతో పాటు బాస్ రిఫ్లెక్స్ స్పీకర్ ను కూడా సోనీ అందించింది. ఈ సౌండ్ బార్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు లేదా మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మరింత స్పష్టమైన సౌండ్ తో పాటు లోతైన బాస్ ను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో సోనీ అందించిన ప్రత్యేక S-Force Front Surround టెక్నాలజీ కారణంగా సరౌండ్ సౌండ్ తో థియేటర్ తరహా ఆడియో అనుభూతి లభిస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో బ్లూటూత్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ తో పాటు LDAC టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా ఇతర బ్లూటూత్ పరికరాల నుంచి హై క్వాలిటీ ఆడియోను వైర్ లెస్ గా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అలాగే, HDMI ARC, ఆప్టికల్ మరియు USB సపోర్ట్ కూడా ఉంటాయి. స్టైలిష్ లుక్, శక్తివంతమైన ఆడియో పెర్ఫార్మెన్స్ మరియు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లతో ఇది మంచి బడ్జెట్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియో డివైజ్ ఎంపికగా నిలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
