చవక ధరలో వైర్లెస్ మైక్ తో 30W Bluetooth Speaker లాంచ్ చేసిన Portronics
Portronics ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త 30W Bluetooth Speaker ని లాంచ్ చేసింది
ఈ స్పీకర్ ని వైర్లెస్ కరోకే మైక్ తో జతగా చేసి అందించింది
ఈ స్పీకర్ చూడటానికి ముచ్చటైన డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది
ఇండియన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Portronics ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త 30W Bluetooth Speaker ని లాంచ్ చేసింది. ఈ స్పీకర్ ని వైర్లెస్ కరోకే మైక్ తో జతగా చేసి అందించింది. ఈ స్పీకర్ చూడటానికి ముచ్చటైన డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది. ఈ స్పీకర్ ని కంఫర్మ్ డిజైన్ మరియు RGB లైట్స్ తో పార్టీ కి అనువైన ఫుల్ సెటప్ తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ పోర్టబుల్ పార్టీ స్పీకర్ ప్రైస్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Survey30W Bluetooth Speaker : ప్రైస్ అండ్ సేల్
పోర్ట్రోనిక్స్ అపోలో 30 పేరుతో కొత్త స్పీకర్ ని కేవలం రూ. 2,299 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఇది పార్టీ స్పీకర్ మరియు కాంపాక్ట్ సైజులో కన్వీనియంట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ ని ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ స్పీకర్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫిషియల్ సైట్ Portronics.com నుంచి కూడా లభిస్తుంది.
Also Read: Lava Agni 4 సూపర్ ఫినిష్ మెటల్ ఫ్రేమ్ మరియు న్యూ కలర్ తో లాంచ్ అవుతోంది.!
Portronics Apollo 30 : ఫీచర్స్
ఈ కొత్త స్పీకర్ కాంపాక్ట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇందులో 30W సౌండ్ అవుట్ పుట్ అందించే పవర్ ఫుల్ స్పీకర్ ఉంటుంది. ఈ స్పీకర్ టోటల్ 30W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ స్పీకర్ లో డైనమిక్ RGB రింగ్ LED లైట్ కలిగి ఉంటుంది. ఇది మంచి పార్టీ యాంబియన్స్ అందిస్తుంది. ఈ స్పీకర్ ను పట్టుకోవడానికి వీలుగా పెద్ద ఆరంజ్ కలర్ హ్యాండిల్ బార్ కూడా ఉంటుంది. ఈ స్పీకర్ HD సౌండ్ అందిస్తుందని పోర్ట్రోనిక్స్ తెలిపింది.

ఈ లేటెస్ట్ స్పీకర్ 5 గంటల ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ కోసం యూనివర్సల్ పోర్ట్ టైప్ C ఛార్జ్ పోర్ట్ ని అందించింది మరియు ఇందులో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఈ స్పీకర్ కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ వెర్షన్ 5.4 సపోర్ట్ తో సీమ్లెస్ కనెక్టివిటీ ఆఫర్ చేస్తుంది. ఈ స్పీకర్ వాల్యూమ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది మరియు బిల్ట్ ఇన్ ఎకో కూడా కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ తో జతగా వైర్లెస్ కరోకే మైక్ కూడా వస్తుంది. ఇది పార్టీ మరియు స్టేజ్ పై ఉపయోగపడేలా ఉంటుంది మరియు రెగ్యులర్ గా ఉపయోగించే విధంగా కూడా ఉంటుంది.