OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది.!

HIGHLIGHTS

OnePlus Nord CE4 అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది

భారీ డిస్కౌంట్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది

OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో 25 వేల ఉప బడ్జెట్ ప్రైస్ లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

OnePlus Nord CE4: ఆఫర్

వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం 18,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

HDFC, Axis మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ వన్ ప్లస్ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: Realme 15 Pro 5G Game of Thrones లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.!

OnePlus Nord CE4: ఫీచర్స్

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్వా టచ్ సపోర్ట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 50MP Sony OIS మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో భారీ 5500 mAh బ్యాటరీ మరియు 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :