Realme 15 Pro 5G Game of Thrones లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.!
Realme 15 Pro 5G Game of Thrones Limited Edition ఈరోజు ఇండియాలో విడుదల చేసింది
ఈ ఫోన్ లో గేమ్ ఆఫ్ త్రోన్స్ థీమ్ డిజైన్ మరియు ఫీచర్స్ అందించినట్లు రియల్ మీ గొప్పగా చెబుతోంది
ఫోన్ చూడటానికి చాలా విలక్షణంగా మరియు ఆకట్టుకునేలా అందించినట్లు ఫోన్ చూడగానే అర్థం అవుతుంది
గత కొంతకాలంగా రియల్ మీ టీజింగ్ చేస్తున్న Realme 15 Pro 5G Game of Thrones Limited Edition స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ లో గేమ్ ఆఫ్ త్రోన్స్ థీమ్ డిజైన్ మరియు ఫీచర్స్ అందించినట్లు రియల్ మీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ చూడటానికి చాలా విలక్షణంగా మరియు ఆకట్టుకునేలా అందించినట్లు ఫోన్ చూడగానే అర్థం అవుతుంది. రియల్ మీ సరికొత్తగా అందించిన ఈ లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyRealme 15 Pro 5G Game of Thrones Limited Edition : ప్రైస్
రియల్ మీ ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ని కేవలం సింగిల్ వేరియంట్ తో అందించింది. ఈ ఫోన్ 12 జీబీ + 512 జీబీ వేరియంట్ తో రూ. 44,999 ధరలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ డ్రాగన్ ఫైర్ బ్లాక్ సింగల్ కలర్ లభిస్తుంది. ఈ ఫోన్ ను ఈ రోజు నుంచి సేల్ కోసం అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది.
ఆఫర్స్ :
ఈ ఫోన్ పై లాంచ్ ఆఫర్స్ కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లేదా ఫోన్ ఎక్స్చేంజ్ ఫై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్చేంజ్ బోనస్ అందుకునే అవకాశం రియల్ మీ ఈ ఫోన్ పై అందించింది.
Realme 15 Pro 5G Game of Thrones Limited Edition : ఫీచర్స్
ఈ రియల్ మీ లేటెస్ట్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ థీమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ డిజైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ విలక్షణమైన మరియు చూడగానే ఆకర్షించే లుక్స్ కలిగి ఉంటుంది. ఇక స్పెక్స్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్సెట్ తో పనిచేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్, 14 జీబీ డైనమిక్ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.8 కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది మరియు ఈ స్క్రీన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 144Hz రిఫ్రిష్ రేటు కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ 50 ఎంపీ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ రియల్ మీ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ లో ముందు 50MP సా సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్టు కలిగి ఉండడమే కాకుండా AI కెమెరా ఫీచర్స్ తో అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుందని రియల్ మీ తెలిపింది.
Also Read: IMC 20205 నుంచి కేవలం రూ. 799 ధరలో Jio Bharat B2 ఫోన్ లాంచ్ చేసిన రిలయన్స్.!
ఇక ఈ ఫోన్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ అతి సన్నని డిజైన్ కలిగి ఉన్నా కూడా 7000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.