IMC 20205 నుంచి కేవలం రూ. 799 ధరలో Jio Bharat B2 ఫోన్ లాంచ్ చేసిన రిలయన్స్.!
ఈరోజు IMC 20205 కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది
ఈ అతిపెద్ద ఈవెంట్ నుంచి జియా అతి చవక ధరలో Jio Bharat B2 ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది
యూజర్ సేఫ్టీ కోసం పెద్దపీట వేస్తూ ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసింది
భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈరోజు IMC 20205 కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. ఈ అతిపెద్ద ఈవెంట్ నుంచి రిలయన్స్ జియా అతి చవక ధరలో Jio Bharat B2 ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. ఇండియా యొక్క సేఫ్టీ ఫస్ట్ ఫోన్ అని దీని గురించి రిలయన్స్ ట్యాగ్ లైన్ అందించింది. ఈ ఫోన్ చాలా చవక ధరలో యూజర్ సేఫ్టీ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.
SurveyJio Bharat B2 : ప్రైస్
ఇండియాలో నిర్వహించే అతిపెద్ద టెక్ షో ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC 2025 నుంచి ఈరోజు రిలయన్స్ జియో ఈ కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. యూజర్ సేఫ్టీ కోసం పెద్దపీట వేస్తూ ఈ కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కేవలం రూ. 799 రూపాయల అతి చవక ధరలో అందించి అందరిని ఆశ్చర్యపరిచింది. జియో ప్రకారం, ఈ ఫీచర్ ఫోన్ తో పిల్లలు మరియు పెద్దల సెక్యూరిటీ మోనిటర్ చేయవచ్చని చెబుతున్నది. ఈ లేటెస్ట్ ఫీచర్ ఫోన్ జియో స్టోర్, జియో మార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇంస్టా మార్ట్ మరియు అన్ని మొబైల్ షాప్స్ నుండి లభిస్తుంది.
Jio Bharat B2 : ఫీచర్స్
ఈ జియో భారత్ కొత్త ఫోన్ సేఫ్టీ షీల్డ్ ఫీచర్ తో వస్తుంది. ఇది లైవ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ మోనిటర్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఫోన్ అండ్ సర్వీస్ హెల్త్, యూసేజ్ మోనిటర్ మరియు 7 రోజులు పని చేసే బ్యాటరీ వంటి ఫీచర్స్ కేవలం రూ. 799 ధరలో అందిస్తుంది.

ఈ ఫోన్ 2.4 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఏకంగా 455 కంటే ఎక్కువ లైవ్ ఛానల్స్ అందించే జియో యాక్సెస్ అందిస్తుంది. ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్ ఇందులో అందించిన సేఫ్టీ షీల్డ్ ఫీచర్. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ తో ఈ ఫోన్ ను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ ఫీచర్ కనెక్ట్ చేసి పూర్తిగా మోనిటర్ చేసే అవకాశం ఉంటుందని జియో చెబుతోంది.
Also Read: Sonodyne Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!
జియో భారత్ బి2 ఫీచర్ ఫోన్ 200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 7 రోజులు పని చేస్తుందని జియో తెలిపింది. ఈ ఫోన్ చాలా చవక రేటుతో వచ్చే జియో ఫోన్ రీఛార్జ్ తో పని చేస్తుంది. అంటే, ఈ ఫోన్ చవక ధరలో లభించడమే కాకుండా నడపడానికి కూడా చాలా తక్కువ రీఛార్జ్ మాత్రమే తీసుకుంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile