OnePlus Nord CE4 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ సేల్ నుంచి ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ లో లభిస్తోంది. ఇండియన్ మార్కెట్లో 25 వేల ఉప బడ్జెట్ ప్రైస్ లో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం 17 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Nord CE4: ఆఫర్
వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 24,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం 18,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
HDFC, Axis మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ వన్ ప్లస్ ఫోన్ కేవలం రూ. 17,999 రూపాయల అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కొనడానికి Buy From Here పై నొక్కండి.
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్వా టచ్ సపోర్ట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ 50MP Sony OIS మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో భారీ 5500 mAh బ్యాటరీ మరియు 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది.