OnePlus Nord Buds 3: వన్ ప్లస్ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను గొప్ప డిజైన్ మరియు 32dB ANC వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ముందుగా ఈ సిరీస్ నుండి ప్రో బడ్స్ ను అందించిన వన్ ప్లస్, ఇప్పుడు డౌన్ టోన్ వెర్షన్ గా ఈ కొత్త బడ్స్ ను తీసుకు వచ్చింది. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లు మరియు ధర వివరాలు తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus Nord Buds 3: ధర
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 2,299 ధరతో అందించింది. ICICI మరియు OneCard క్రెడిట్ కార్డ్ లతో ఈ బడ్స్ ను కొనుగోలు చేసే యూజర్లకు రూ. 200 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ బడ్స్ ను 2,099 ధరకే అందుకోవచ్చు.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను కొత్త మంచి ఫిట్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ లో 12.4 టైటానైజ్డ్ డైఫాగ్రామ్ స్పీకర్ ను అందించింది. దీనికి జతగా అందించిన Bass Wave 2.0 అల్ట్రా ఎన్ హెన్స్డ్ బాస్ తో గొప్ప ప్రీమియం BASS సౌండ్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఈ బడ్స్ 32dB ANC సపోర్ట్ మరియు ట్రాన్స్పరెన్సీ మోడ్ తో కూడా జతగా వస్తుంది. అంతేకాదు, AI noise cancellation calls సపోర్ట్ తో గొప్ప కాలింగ్ సౌలభ్యం కూడా అందిస్తుంది.
ఈ కొత్త వన్ ప్లస్ బడ్స్ లేటెస్ట్ Bluetooth 5.4 సపోర్ట్ మరియు డ్యూయల్ కనెక్షన్ సపోర్ట్ లను కలిగి వుంది. వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ ను 43 గంటల ప్లే బ్యాక్ అందించే లాంగ్ బ్యాటరీ తో అందించింది మరియు బ్యాటరీ హెల్త్ కోసం TUV Rheinland సర్టిఫికేషన్ కలిగిన మొదటి బడ్స్ గా ఇది నిలుస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ హార్మోని గ్రే మరియు మెలోడీక్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ IP55-rated వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile