బడ్జెట్ ధరలో కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Noise

HIGHLIGHTS

నోయిస్ ఇప్పుడు ప్రీమియం సౌండ్ వార్ సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టింది

నోయిస్ ఇప్పుడు బడ్జెట్ ధరలో కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని లాంచ్ చేసింది

ప్రీమియం డిజైన్, ఫీచర్స్ మరియు ఆకట్టుకునే కలర్ ఆప్షన్స్ లో కూడా అందించింది

ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్ మరియు ఎయిర్ బడ్స్ ని అందించిన నోయిస్ ఇప్పుడు ప్రీమియం సౌండ్ వార్ సెగ్మెంట్లో కూడా అడుగుపెట్టింది. నోయిస్ ఇప్పుడు బడ్జెట్ ధరలో కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ని ప్రీమియం డిజైన్, ఫీచర్స్ మరియు ఆకట్టుకునే కలర్ ఆప్షన్స్ లో కూడా అందించింది. నోయిస్ యొక్క లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ యొక్క ప్రైస్ ఫీచర్స్ మరియు ఆఫర్స్ వివరంగా చూద్దాం.

Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్ : ప్రైస్

నోయిస్ 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Home Stage 5.1 మోడల్ ని కొత్తగా విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 14,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ పైన రూ. 1,399 అదనపు డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల HDFC క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్స్ ని కూడా లాంచ్ లో భాగంగా నోయిస్ అందించింది.

ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 12,600 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ మరియు నోయిస్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతోంది.

Also Read: Redmi 17C 5G జస్ట్ లాంచ్ అయ్యింది .. ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

Noise 5.1 Dolby Atmos సౌండ్ బార్: ఫీచర్స్

నోయిస్ ఈ సౌండ్ బార్ ను 5.1 ఛానల్ సెటప్ తో అందించింది. ఈ సౌండ్ బార్ సెటప్ లో 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే డౌన్ ఫైరింగ్ ఊపర్ కలిగిన సబ్ ఊఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో 500 వాట్ జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ బ్లాక్ మరియు సిల్వర్ రెండు కలర్ ఆప్షన్స్ లో కూడా లభిస్తుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, నోయిస్ ఈ సౌండ్ బార్ ని 5.1 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. ఇది ఇంటి మొత్తాన్ని సౌండ్ తో నింపడమే కాకుండా మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుందని కూడా ఈ సౌండ్ బార్ గురించి నోయిస్ పేర్కొంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్, బ్లూటూత్ మరియు AUX వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ మరియు ఫిజికల్ మీడియా బటన్స్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :