just launched Redmi 17C 5G price features know here
Redmi 17C 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో రిలీజ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ తో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇండియాలో జస్ట్ లాంచ్ అయిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
రెడ్ మీ 17 సి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఇందులో 4 జీబీ + 128 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 20,999 ధరతో మరియు 4 జీబీ + 128 జీబీ హై ఎండ్ వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కాఫీ బృ, పర్పల్ డాన్ మరియు డార్క్ నైట్ అనే మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. అక్టోబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు షియోమీ అఫిషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుందని మేమియు నిన్ననే అంచనా వేసి చెప్పాము. మేమియు అంచనా వేసినట్లు షియోమీ ఈ ఫోన్ ను అదే ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది.
Also Read: Apple Pay: యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది .. కొత్త పేమెంట్ సర్వీస్ తెచ్చింది.!
షియోమీ ఈ లేటెస్ట్ రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని చూడగానే ఆకట్టుకునే ప్రీమియం లెదర్ డిజైన్తో విడుదల చేసింది. ఈ ఫోన్ చాలా స్పీడ్ గా ఉంటుంది అయినా కూడా పెద్ద బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ కోసం అనుకూలమైన 6.9 అంగుళాల పరిమాణం కలిగిన పెద్ద స్క్రీన్ ఈ ఫోన్లో అందించింది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 660 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఈ లేటెస్ట్ రెడ్ మీ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ Dimensity 6300 తో లాంచ్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ లో 6GB ఫిజికల్ అండ్ 6GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ Hyper OS 3 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు 10W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.