may upi payment could create problems because of No UPI Day on tomorrow
No UPI Day: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. చిన్న చిల్లర షాపులు మరియు టీ దుకాణాలు మొదలుకొని పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్ని అవసరాలకు జస్ట్ సింగిల్ క్లిక్ తో UPI ద్వారా క్షణాల్లో చెల్లింపులు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే, ఇటీవల మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పై ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమాలు వ్యతిరేకిస్తూ, వర్తకులు 2026 అక్టోబర్ 2న “నో యూపీఐ డే” నిర్వహించాలనే పిలుపునిచ్చారు.
“నో యూపీఐ డే” అంటే దేశవ్యాప్తంగా యుపిఐ సాంకేతిక వ్యవస్థను మూసివేయడం కాదు. మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పై ప్రభుత్వం తీసుకున్న కొత్త నియమాలు వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాపార సంఘాలు ప్రతిపాదించిన నిరసన కార్యక్రమం. అందుకే, యూపీఐ పేమెంట్ ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2వ తేదీన యూపీఐ పేమెంట్ లను స్వీకరించకూడదని పిలుపు నిచ్చారు. అంటే, అక్టోబర్ 2వ తేదీ అనగా రేపు యూపీఐ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ తీసుకోవాలని వర్తకుల సంఘం పేర్కొంది.
Also Read: BSNL Freedom 2.0: ఉచితంగా 24 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!