No UPI Day: ఆన్లైన్ పేమెంట్ తో కష్టాలు పడొద్దు.. అని చెబితే నమ్మకండి.!
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి UPI ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది
వర్తకులు 2026 అక్టోబర్ 2న “నో యూపీఐ డే” నిర్వహించాలనే పిలుపునిచ్చారు
నో యూపీఐ డే నిరసనను వ్యాపార సంఘాలు ఉపసంహరించుకున్నాయి
No UPI Day: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ఒక ముఖ్యమైన కారణంగా నిలిచింది. చిన్న చిల్లర షాపులు మరియు టీ దుకాణాలు మొదలుకొని పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్ని అవసరాలకు జస్ట్ సింగిల్ క్లిక్ తో UPI ద్వారా క్షణాల్లో చెల్లింపులు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. అయితే, ఇటీవల మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పై ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమాలు వ్యతిరేకిస్తూ, వర్తకులు 2026 అక్టోబర్ 2న “నో యూపీఐ డే” నిర్వహించాలనే పిలుపునిచ్చారు. దీని గురించి ఆన్లైన్ పేమెంట్ తో కష్టాలు పడొద్దు.. అని ఎవరైనా చెబితే నమ్మకండి. ఎందుకంటే, ఈ నిరసనను సంబంధిత రిటైలర్ మరియు వినియోగదారుల ఉత్పత్తుల వ్యాపార సంఘాలు ఉపసంహరించుకున్నాయి.
SurveyNo UPI Day: అంటే ఏమిటి?
“నో యూపీఐ డే” అంటే దేశవ్యాప్తంగా యుపిఐ సాంకేతిక వ్యవస్థను మూసివేయడం కాదు. మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పై ప్రభుత్వం తీసుకున్న కొత్త నియమాలు వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాపార సంఘాలు ప్రతిపాదించిన నిరసన కార్యక్రమం. అందుకే, యూపీఐ పేమెంట్ ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 2వ తేదీన యూపీఐ పేమెంట్ లను స్వీకరించకూడదని పిలుపు నిచ్చారు. అంటే, అక్టోబర్ 2వ తేదీ అనగా రేపు యూపీఐ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ తీసుకోవాలని వర్తకుల సంఘం పేర్కొంది.
Also Read: BSNL Freedom 2.0: ఉచితంగా 24 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందుకోండి.!
ఈ విషయం పై సెప్టెంబర్ 30న వ్యాపార ప్రతినిధుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసింది. ఈ చర్చలు సఫలం కావడంతో AIMRA, AICPDF తదితర సంస్థలు తమ “నో యూపీఐ డే” పిలుపును ఉపసంహరించుకున్నాయి.
అసలు వివాదం ఏమిటి?
మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) పై కొత్త రూల్స్ ని ప్రభుత్వం అమలు చేయడానికి అల్టిమేటం ఇచ్చింది. అదేమిటంటే, రూ. 2,000 రూపాయల పైబడి వ్యాపారి మరియు వినియోగదారు UPI లావాదేవీలపై 0.4 శాతం MDR విధించే రూల్ ని ప్రభుత్వం తెచ్చింది. ఇది వ్యాపారి జేబుకు చిల్లుపెట్టె నియం అని, ఈ కొత్త రూల్ ను తాము వ్యతిరేకిస్తున్నామని వ్యాపార సంఘాలు తెలిపాయి. రిటైలర్లు, ముఖ్యంగా చిన్న వ్యాపారులు తమ లాభాల మార్జిన్ ఇప్పటికే తక్కువగా ఉన్న సమయంలో అదనపు లావాదేవీ వ్యయం వస్తే తమపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని తమ ఇబ్బందిని వెల్లడించారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
