apple introduces new Apple Pay service in india know how to use
Apple Pay: డిజిటల్ పేమెంట్ వరల్డ్ లో యాపిల్ పే అనేది కొత్త పేరేమి కాదు. కాకపోతే ఈ యాపిల్ పేమెంట్ సర్వీస్ ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అమెరికా సహా అనేక దేశాల్లో చాలా విస్తృతంగా ఈ సిరీస్ ఉపయోగించబడుతోంది. అయితే, ఈ సిరీస్ 2026 సెప్టెంబర్ 30వ ఇతడి నుంచి ఇండియాలో కూడా ప్రారంభించబడింది. ప్రస్తుతం, భారత్ లో iPhone, iPad, Apple Watch లపై ఈ యాపిల్ పే అందుబాటులో ఉంది. అయితే, Mac కు కూడా ఈ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రానుందని యాపిల్ తెలిపింది.
ఈ పేమెంట్ సిస్టం లేదా సర్వీస్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, యాపిల్ పే అనేది క్రెడిట్ లేదా డెబిట్ కార్డును యాపిల్ డివైజ్ లో డిజిటల్ రూపంలో ఉపయోగించుకునే చెల్లింపు సర్వీస్. ఫిజికల్ కార్డును ప్రతి సారి బయటకు తీయాల్సిన అవసరం లేకుండా, Apple Wallet లో యూజర్ కార్డును జోడించి iPhone లేదా Apple Watch ద్వారా కాంటాక్ట్ లెస్ టెర్మినల్ వద్ద పేమెంట్ చేయవచ్చు.
ఈ సర్వీస్ ను కేవలం షాపుల్లో మాత్రమే కాదు ఈ సర్వీస్ కు మద్దతు ఇచ్చే యాప్స్, వెబ్ సైట్ల లో కూడా ఉపయోగించవచ్చు. భారతదేశంలో ఇప్పటికే UPI అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు విధానంగా ఉంది. ఇలాంటి మార్కెట్లో యాపిల్ పే రావడంతో యూజర్లకు మరో డిజిటల్ చెల్లింపు ఆప్షన్ అంది వచ్చింది. ముఖ్యంగా, ఐఫోన్, యాపిల్ వాచ్ మరియు ఐప్యాడ్ వంటి యాపిల్ డివైజ్ ఉపయోగించే వారికి ఇది మరింత గొప్ప ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.
యాపిల్ ప్రకారం, ముందుగా ప్రారంభ దశలో Axis Bank జారీ చేసిన Visa, Mastercard క్రెడిట్ కార్డులు యాపిల్ ప్లే లో జోడించడానికి అర్హత కలిగి ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో మరిన్ని బ్యాంక్ కార్డులు కూడా అందుబాటులోకి రావచ్చని యాపిల్ తెలిపింది. కాబట్టి, యాపిల్ పే సర్వీస్ ఉపయోగించాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా వారి వద్ద ఉన్న ప్రతి బ్యాంకు కార్డు ఈ సర్వీస్ కు అర్హత కలిగి ఉందో ముందుగా తనిఖీ చేయాలి.
Also Read: No UPI Day: ఆన్లైన్ పేమెంట్ తో కష్టాలు పడొద్దు.. అని చెబితే నమ్మకండి.!
మన ఫిజికల్ క్రెడిట్ కార్డులో ఉన్న అసలు కార్డు నంబర్ ను ప్రతి చెల్లింపులో వ్యాపారికి ఇవ్వడం కాకుండా, యాపిల్ పే ఒక Device Account Number ను ఉపయోగిస్తుంది. ఈ ప్రత్యేక నంబర్ పరికరంలోని Secure Element అనే ప్రత్యేక భద్రతా వ్యవస్థలో ఎన్‌క్రిప్ట్ చేసి స్టోర్ చేయబడుతుంది. ఈ డేటా యాపిల్ సర్వర్ లో కూడా స్టోర్ చేయదు. అంటే, ఇది కేవలం డివైజ్ లో మాత్రమే స్టోర్ అవుతుంది. లావాదేవీని మరింత సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగపడుతుంది.
అలాగే, కాంటాక్ట్ లెస్ పేమెంట్ చేసే సమయంలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ NFC సాంకేతికత పనిచేస్తుంది. అందుకే, కాంటాక్ట్ లెస్ చెల్లింపు టెర్మినల్ దగ్గర iPhone ను ఉంచగానే చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జస్ట్ వన్ క్లిక్ లో పేమెంట్ అయిపోతుంది.