BSNL Freedom 2.0 offers 24 days unlimited benefits at rs 1 only
BSNL Freedom 2.0: 4G నెట్వర్క్ నువ్వు విస్తరించిన దగ్గర నుంచి భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి నుంచి బడ్జెట్ ధరకే గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్లను అందించిన ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ, ఇప్పుడు ఉచిత ఆఫర్లను అందించడం కూడా ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం 2.0 లో భాగంగా బిఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లకు 24 రోజుల ఉచిత అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం 2.0 అనేది గత సంవత్సరం లాంచ్ చేసిన రూ. 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క కొత్త వెర్షన్. ఈ ఆఫర్ తో కేవలం రూపాయి మాత్రమే చెల్లించి బిఎస్ఎన్ఎల్ యొక్క ఉచిత సిమ్ కార్డు తో పాటు 24 రోజుల అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ యూజర్లు ఆనందించవచ్చు. అయితే, ఈ ఆఫర్ ని కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెంబర్ తీసుకున్న యూజర్ల కోసం మాత్రమే ఆఫర్ చేస్తుంది. అంటే, ఇతర నెట్వర్క్ నుంచి బిఎస్ఎన్ఎల్ కి మారేవారికి లేదా కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకుని యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని మీరు గమనించాలి.
బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం 2.0 ఆఫర్ ద్వారా బిఎస్ఎన్ఎల్ యొక్క ఉచిత కొత్త సిమ్ కార్డు తీసుకుని మొదటగా ఒక రూపాయి చెల్లించి రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ బెనిఫిట్స్ అందిస్తుంది. అంటే, జస్ట్ నామమాత్రపు రుసుముతో ఈ ప్లాన్ మీకు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తుందని అర్థం.
ఇక ఈ బిఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లకు లభించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 1 జీబీ హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ని ఆఫర్ చేస్తుంది.
Also Read: Flipkart BBD Sale ఎర్లీ బర్డ్ బిగ్ డీల్ తో 55 ఇంచ్ QLED Smart Tv అత్యల్ప ధరలో లభిస్తోంది.!
ఇది మాత్రమే కాదు, ఈ బిఎస్ఎన్ఎల్ రూ. ప్లాన్ తో వచ్చే డైలీ 1జీబీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో మీకు అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అంటే, మీరు చెల్లించే కేవలం రూ. 1 రూపాయికే 24 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించవచ్చు. ఈ ప్లాన్ కోసం మీ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్ ని సంప్రదించవచ్చు.