Lumio Aura 5: మార్కెట్ లో కొత్తగా విడుదలైన Hi-Fi బుక్ షెల్ఫ్ స్పీకర్ల గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

ఒకప్పుడు హోం ఆడియో అంటే కేవలం బుక్ సెల్ఫ్ స్పీకర్ల పేరు మాత్రమే వినిపించేది

లుమియా ఆరా 5 పేరుతో ప్రీమియం Hi-Fi బుక్ షెల్ఫ్ స్పీకర్లను లాంచ్ చేసింది

ప్రీమియం సెటప్ మరియు డిజైన్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది

Lumio Aura 5: ఇప్పుడంటే ఎక్కడ చూసినా సౌండ్ బార్ మాటే వినిపిస్తోంది. కానీ, ఒకప్పుడు హోం ఆడియో అంటే కేవలం బుక్ సెల్ఫ్ స్పీకర్ల పేరు మాత్రమే వినిపించేది. ఇప్పుడు ఈ పాత జ్ఞాపకాలు ఎందుకు నెమర వేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు తగిన కారణం ఉంది. . ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లుమియా, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా లుమియా ఆరా 5 పేరుతో ప్రీమియం Hi-Fi బుక్ షెల్ఫ్ స్పీకర్లను లాంచ్ చేసింది. స్పీకర్లు ప్రీమియం సెటప్ మరియు డిజైన్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది.

Lumio Aura 5: ఫీచర్స్

లూమియా ఈ బుక్ షెల్ఫ్ స్పీకర్లను చాల ప్రీమియం అండ్ స్టన్నింగ్ డిజైన్ తో అందించింది. ఈ స్పీకర్ సెటప్ లో మొత్తం రెండు స్పీకర్ బాక్స్ లు వస్తాయి. ఈ స్పీకర్ బాక్స్ లో 4.5 ఇంచ్ అల్యునియం ఉఫర్ మరియు 1 ఇంచ్ సిల్క్ డూమ్ ట్వీటర్ ఉంటాయి. ఇది చాలా ప్రీమియం సెటప్ మరియు ఇందులో అందించిన సెటప్ తో ఈ స్పీకర్ టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

ఇది కంప్లీట్ Hi-Fi సెటప్ అండ్ ఫీచర్స్ తో ఉంటుంది. ఈ స్పీకర్ 1 మీటర్ డిస్టెన్స్ లో 105 dB SPL సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, 35Hz బాస్ ఎక్స్ టెన్షన్ సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు ఇది ప్రీమియం గ్రేడ్ సౌండ్ కొలత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, 1% THD తో ప్యూర్ ఆడియో అందిస్తుంది. ఇది దాదాపు డిస్టార్షన్ లేకుండా మీకు ఆడియోని అందిస్తుంది. అంతేకాదు, ఈ స్పీకర్ 35Hz – 20,000Hz (20kHz) ఫ్రీక్వెన్సీలను పునరుత్పత్తి చేయడానికి రూపొందించబడింది. అలాగే, FLAC 24-bit/48 kHz సపోర్ట్ తో లాస్ లెస్ ఆడియో ఆఫర్ చేస్తుంది.

ఇక ఈ స్పీకర్ సౌండ్ అందించే ఆమ్ప్లిఫైర్ విషయానికి వస్తే, ఈ స్పీకర్లు బిల్ట్ ఇన్ Class-D amplifier తో వస్తుంది. ఈ స్పీకర్ లో HDMI ARC, CEC, USB, coaxial మరియు 3.5mm పోర్ట్ వంటి కనెక్టివిటీ సపోర్ట్ కూడా లూమియా అందించింది. ఈ స్పీకర్ సెటప్ తో జతగా బిల్ట్ ఇన్ డిస్ప్లే కలిగిన Minion OLED రిమోట్ కూడా అందిస్తుంది. ఈ మొత్తం సెటప్ చాలా పటిష్టమైన ప్రీమియం చెక్క బాక్స్ లో అందిస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో కొత్త 5.1 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన Noise

Lumio Aura 5: ప్రైస్

లూమియా ఈ ప్రీమియం బుక్ షెల్స్ స్పీకర్లను రూ. 24,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, లాంచ్ ఆఫర్స్ లో భాగంగా ఈ ఫోన్ ప్రారంభ లిమిటెడ్ సేల్ లో భాగంగా రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్పీకర్ సేల్ అక్టోబర్ 15వ తేదీ నుంచి అమెజాన్ ఇంద ద్వారా ప్రారంభం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :