JBL Beam 2 మరియు Wave Buds 2 డిసెంబర్ 17 విడుదల కాబోతున్నాయి.!
JBL Beam 2 మరియు Wave Buds విడుదల చేస్తున్నట్లు JBL తెలిపింది
ఈ అప్ కమింగ్ బడ్స్ ను డిసెంబర్ 17న విడుదల చేస్తోంది
ఈ రెండు బడ్స్ కూడా JBL Headphone APP సపోర్ట్ తో వస్తాయి
JBL Beam 2 మరియు Wave Buds ను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్లు JBL తెలిపింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను లేటెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేయనున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ బడ్స్ కీలకమైన ఫీచర్స్ మరియు అంచనా ధర వివరాలు ఏమిటో చూద్దామా.
SurveyJBL Beam 2 & Wave Buds 2: లాంచ్
జెబిఎల్ డిసెంబర్ 17న ఈ బడ్స్ ను లాంచ్ చేస్తుంది. ఈ బడ్స్ ను అమెజాన్ ఇండియా ద్వారా లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది. ఈ పీజీ నుంచి ఈ రెండు బడ్స్ అంచనా ధర మరియు కీలకమైన ఫీచర్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది.
JBL Beam 2 & Wave Buds 2: ఫీచర్స్
ఈ బడ్స్ ను ఇప్పుడు యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC)ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు జెబిఎల్ ప్రకటించింది. ఈ బడ్స్ ను JBL Pure Bass సౌండ్ అందించే 8mm డైనమిక్ స్పీకర్ల తో లాంచ్ చేస్తోంది. ఈ బడ్స్ మల్టీ డివైజ్ కనెక్టివిటీ మరియు ఈజీగా స్విచ్ చేసుకునేలా అందిస్తోంది.

ఈ జెబిఎల్ అప్ కమింగ్ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 తో వస్తాయి. ఈ బడ్స్ లో క్లియర్ కాల్స్ కోసం క్వాడ్ Mic సపోర్ట్ ను అందించినట్టు జెబిఎల్ తెలిపింది. ఈ బడ్స్ ను 40 గంటల ప్లే టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. అయితే, ANC On లో ఉన్నప్పుడు 32 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 17 వేలకే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ రెండు బడ్స్ లో బీమ్ 2 ను స్టిక్ డిజైన్ తో వేవ్ బడ్స్ ను బడ్ డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఈ రెండు బడ్స్ కూడా JBL Headphone APP సపోర్ట్ తో వస్తాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
