iQOO ఈరోజు ఇండియా మార్కెట్ లో తన మొదటి TWS ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. iQOO TWS 1e ANC పేరుతో విడుదల చేసిన ఈ బడ్స్ ను చాలా చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. ఈ ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ ను మంచి డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ యూజర్లకు అందుబాటు ధరలో అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
iQOO TWS 1e ANC : ధర
ఐకూ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,899 ధరలో అందించింది. అయితే, ఈ ధర బ్యాంక్ ఆఫర్ తో కలుపుకొని వుంది. ఈ ఐకూ ఇయర్ బడ్స్ ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఈ ఐకూ ఇయర్ బడ్స్ ను అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఐకూ యొక్క ఈ కొత్త ట్రూ వైర్లెస్ బడ్స్ 30dB వరకు నోయిస్ క్యాన్సిలేషన్ అందించే ఇంటెలిజెంట్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అంతేకాదు, కాల్స్ కోసం AI నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ను కలిగి ఉంటుంది మరియు చాలా క్లియర్ మరియు లీనమయ్యే కాలింగ్ అనుభూతిని అందిస్తుంది అని ఐకూ చెబుతోంది.
ఈ ఇయర్ బడ్స్ 42 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు ఈ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ లో ఉన్న ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 3 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ అందిస్తుందని ఐకూ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ 88ms లో గేమింగ్ లెటెన్సీ తో మంచిది గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఐకూ కొత్త ఇయర్ బడ్స్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్, బ్లూటూత్ 5.3 సపోర్ట్, IP54 రేటింగ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లతో వస్తుంది. హై రిజల్యూషన్ సౌండ్ అందించే 11mm పవర్ ఫుల్ స్పీకర్లు ఈ బడ్స్ లో ఉన్నాయి మరియు DeepX 3.0 స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ కూడా అందిస్తుందిట.