iQOO Buds launched with bt 6.1 like premium features under budget price
iQOO Buds: ఐకూ ఈరోజు కొత్త స్మార్ట్ ఫోన్ తో పాటు కొత్త ఇయర్ బడ్స్ కూడా లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను బ్లూటూత్ 6.1 మరియు మరిన్ని లేటెస్ట్ ప్రీమియం ఫీచర్స్ తో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈరోజే సరికొత్తగా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
ఐకూ ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,899 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. అయితే, మొదటి సేల్ ఆఫర్స్ తో ఈ బడ్స్ ను కేవలం రూ. 1,699 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఐకూ తెలిపింది. ఆగస్టు 25న ఈ ఇయర్ బడ్స్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ బడ్స్ ను అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఐకూ ఈ ఇయర్ బడ్స్ ను సింపుల్ అండ్ స్టన్నింగ్ డిజైన్ లో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ డ్యూయల్ టోన్ డిజైన్ తో ఉంటుంది మరియు చాలా ప్రీమియం లుక్స్ తో వస్తుంది. ఇందులో 10mm స్పీకర్ తో అందించింది. ఇది డీప్ బాస్ అండ్ క్రిస్పీ సౌండ్ అందిస్తుంది మరియు AAC అండ్ SBC కోడెక్ ఫీచర్ తో వస్తుంది. అయితే, ఈ ఇయర్ బడ్స్ లో ANC ఫీచర్ ఇవ్వకపోవడం లోటుగా చెప్పొచ్చు. అయితే, ఇందులో డ్యూయల్ మైక్ సెటప్ మరియు AI నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో గొప్ప కాలింగ్ సపోర్ట్ తో అందించింది.
ఇక ఈ న్యూ ఇయర్ బడ్స్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది బ్లూటూత్ 6.1 కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, డ్యూయల్ డివైజ్ కనెక్షన్ తో రెండు డివైజెస్ మధ్య చేంజ్ చేసుకునే అవకాశం తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఫీచర్ తో కూడా వస్తుంది.
Also Read: Realme P4s: సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా లాంచ్ అవుతోంది .. ఫీచర్స్ మామూలుగా లేవుగా.!
ఈ ఇయర్ బడ్స్ లాంచ్ ప్లే బ్యాక్ అందించిన బిగ్ బ్యాటరీ సెటప్ కలిగి ఉంటుంది. ఇది బాక్స్ మరియు బడ్స్ తో కలిపి టోటల్ 50 గంటల దీర్ఘ ప్లేబ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ ఐకూ యొక్క vEarphones యాప్ కి కూడా సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ యాప్ తో సౌండ్ ను యూజర్ కు నచ్చినట్లు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ బడ్స్ IP54 రేటెడ్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. చివరిగా, గేమింగ్ కోసం కూడా ఈ బడ్స్ లో 42ms లో లెటెన్సీ ఫీచర్ ను కూడా అందించింది.