వీధి మొత్తాన్ని అల్లాడించే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి ధరలో పొందండి.!

HIGHLIGHTS

వీధి మొత్తాన్ని అల్లాడించే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి ధరలో పొందొచ్చు

900W సౌండ్ అవుట్ పుట్ తో వీధి మొత్తాన్ని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది

ఇది మీ స్మార్ట్ టీవీ తో జతగా మంచి మ్యూజిక్ పార్టనర్ అవుతుంది

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి వీధి మొత్తాన్ని అల్లాడించే 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ని అతి ధరలో పొందొచ్చు. ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ మరియు 900W సౌండ్ అవుట్ పుట్ తో వీధి మొత్తాన్ని షేక్ చేసే సత్తా కలిగి ఉంటుంది. మీ స్మార్ట్ టీవీ తో జతగా మంచి మ్యూజిక్ పార్ట్నర్ ని జత చేయాలనుకుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.

7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్స్

ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ జెబ్రోనిక్స్ గత సంవత్సరం చివరిలో రిలీజ్ చేసిన 7.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మోడల్ Juke Bar 9920 పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ గురించే మనం మాట్లాడుకుంటుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 32,999 ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన రూ. 10,000 రూపాయల బరి డిస్కౌంట్ తో కేవలం రూ. 229,99 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది.

ఈ భారీ డిస్కౌంట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్ట్ పై రూ. 1,625 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కేవలం రూ. 21,374 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఇది ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత నమోదైన అత్యల్ప ధర ఇదే అవుతుంది.

Also Read : Google Pixel 11 Pro Fold సూపర్ స్లీక్ డిజైన్ మరియు అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.. ధర చూస్తే మతిపోతుంది.!

జెబ్రోనిక్స్ 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ సింపుల్ డిజైన్ లో ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో కేవలం బార్ మరియు సబ్ ఉఫర్ మాత్రమే ఉంటాయి. అయితే, ఇది రూమ్ లో అన్ని వైపులా నుంచి సౌండ్ వచ్చేలా స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. అది ఎలాగంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో మొత్తం 9 స్పీకర్ ఉంటాయి. వీటిలో 4 అప్ ఫైరింగ్ స్పీకర్, ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్ జత సైడ్ లో కూడా రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ ఉంటాయి.

ఈ సెటప్ తో సౌండ్ బార్ ముందు ఉన్నా కూడా సౌండ్ రూమ్ లో అన్ని వైపుల నుంచి వస్తుంది. ఇదే కాదు ఇది ఇంటిని పాటు వీధి మొత్తాన్ని షేక్ చేసే 12 అంగుళాల బిగ్ ఉఫర్ కలిగిన పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా ఇందులో ఉంటుంది. మార్కెట్లో ఎక్కువగా లభించే సౌండ్ బార్స్ కేవలం 5 ఇంచ్ నుంచి 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ తో మాత్రమే వస్తాయి.

ఈ లేటెస్ట్ సౌండ్ బార్ లో డాల్బీ అట్మాస్ మరియు ZEB అకౌస్టి మాక్స్ మల్టీ డైమెన్షనల్ సౌండ్ అనే సౌండ్ టెక్ తో వస్తుంది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది మరియు మీ ఇంటినే సినిమా థియేటర్ గా మారుస్తుంది. ఇది టోటల్ 900W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI (Arc), AUX, USB బ్లూటూత్ మరియు ఆప్టికల్ ఇన్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :