boAt 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను కేవలం 8 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!

HIGHLIGHTS

boAt 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను ఎనిమిది వేల బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప అవకాశం

సాధారణ సౌండ్ బార్ లభించే ధరకే ఈ 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ లభించడం మంచి విషయం అవుతుంది

బోట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Bar 4100 DA ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది

boAt 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను ఈరోజు కేవలం ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే గొప్ప అవకాశం మీ కోసం ఎదురు చూస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో దాదాపు 15 వేల రూపాయల బడ్జెట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ప్రస్తుతం దాదాపు సగం ధరకే లభించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా, సాధారణ సౌండ్ బార్ లభించే ధరకే ఈ 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ లభించడం మంచి విషయం అవుతుంది.

boAt 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

బోట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Aavante Bar 4100 DA ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు భారీ ప్రైస్ కట్ అందుకుని కేవలం రూ. 9,499 రూపాయల ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 950 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 8,549 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

Also Read: LPG యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో నుంచే Biometric Aadhaar e-KYC అప్డేట్ చేసుకోండి.!

boAt 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ బోట్ 3.1.2 ఛానల్ సెటప్ కలిగిన అవాంటే బార్ 4100DA గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో ఒక ప్రీమియం బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ బార్ లో ముందు నాలుగు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఈ స్పీకర్ సెటప్ తో ఈ సౌండ్ బార్ గొప్ప సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. ఇక ఈ సౌండ్ బార్ తో వచ్చే సభ ఉఫర్ గొప్ప డీప్ బాస్ సౌండ్ తో ఇంటిని షేక్ చేసే సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 300W సౌండ్ అందిస్తుంది.

సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ సౌండ్ బార్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. ఇది 3D సౌండ్ మరియు సూపర్ సరౌండ్ సౌండ్ ను ఆఫర్ చేస్తుంది. ఇందులో, HDMI, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఇది బడ్జెట్ ధరలో డాల్బీ అట్మాస్ సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ డీల్ గా ఈరోజు మీకు అందుబాటులో ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :