flipkart offers big discount on latest 5.1.2 Dolby Atmos soundbar
లేటెస్ట్ 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ గత నెల మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు 600W సినిమాటిక్ సౌండ్ సపోర్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది.
Portronics గత నెల విడుదల చేసిన Sound Slick X1 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ పై ఈ ఆఫర్ అందించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, పోర్ట్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ను 19,499 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ కూడా ఇదే ప్రైస్ తో ఈ సౌండ్ బార్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని ఈరోజు జత చేసింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 16,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
పోర్ట్రోనిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 5.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ కంప్లీట్ సెటప్ కూడా పూర్తిగా వైర్లెస్ ఫీచర్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ఫ్రంట్ మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ చూడగానే ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ తో ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 5.1.2 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో సౌండ్ ని కావాల్సిన విధంగా ట్యూన్ చేసే స్లీక్ రిమోట్ కూడా ఈ సౌండ్ బార్ తో జతగా వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 600W సౌండ్ అవుట్ పుట్ తో ఇంటిని షేక్ చేసే సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ యూజర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.