flipkart freedom sale best 5.2.4 Dolby Atmos soundbar deals under 15k today
గతంలో సాధారణ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ కొనాలంటే కూడా 20 వేల రూపాయలైనా చెల్లించాలి. అయితే, పెరిగిన టెక్నాలజీ మార్కెట్ కాంపిటీషన్ తో సౌండ్ బార్ రేట్లు చాలా బాగా తగ్గిపోయాయి. అయితే, ఇప్పుడు కూడా 5.2.4 డాల్బీ సౌండ్ బార్ కోసం బాగానే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్ దెబ్బకి నార్మల్ సౌండ్ బార్ రేటుకే 5.2.4 Dolby Atmos సౌండ్ బార్స్ లభిస్తున్నాయి.
ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ని ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రారంభించింది. ఈ సేల్ నుంచి చాలా గొప్ప ఆఫర్స్ ని అందించింది. ఈ సేల్ నుంచి చాలా సౌండ్ బార్ లు మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. అయితే, ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ డిస్కౌంట్ దెబ్బకి నార్మల్ సౌండ్ బార్ రేటుకే 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఈ రోజు చూద్దాం.
ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బోట్ సౌండ్ బార్ డీల్ బాగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే, రీసెంట్ గా విడుదలైన ఈ సౌండ్ బార్ ఈరోజు 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 14,749 ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది. ఇది గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది మరియు HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Moto G Max: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!
ఇది మోటోరోలా అందించిన సౌండ్ బార్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 79% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, SBI క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,250 రూపాయల అదనపు తగ్గింపు కూడా అందుతుంది. ఈ ఆఫర్ లతో ఈ మోటోరోలా సౌండ్ బార్ కేవలం రూ. 14,749 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ కూడా 5.2.4 డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో కూడా ఫ్రంట్, అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన బార్, డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ సెటప్ ఉంటుంది. ఇది టోటల్ 700W సౌండ్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. అలాగే, ఆప్టికల్, HDMI Arc, USB, బ్లూటూత్ మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.