Moto G Max: ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది.!
మోటోరోలా కొత్త 5జి ఫోన్ మోటో జి మాక్స్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ ను ప్రైస్ కి తగిన విలువనిచ్చే స్పెక్స్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది
Moto G Max: మోటోరోలా కొత్త 5జి ఫోన్ మోటో జి మాక్స్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో లాంచ్ అయ్యింది. మొబైల్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ప్రైస్ భారీగా పెరిగిన సంగతి విదితమే. అయితే, ఈ ఫోన్ ను ప్రైస్ కి తగిన విలువనిచ్చే స్పెక్స్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోటోరోలా 5జి ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ చూద్దామా.
SurveyMoto G Max: ప్రైస్
మోటరోలా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 6GB + 128GB సింగిల్ వేరియంట్ లో మాత్రమే విడుదల చేసింది. ఇక ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను రూ. 27,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పాంటోన్ స్టార్ గేజర్, పాంటోన్ అలాస్కన్ బ్లూ మరియు పాంటోన్ మలాగా అనే మూడు అందమైన రంగుల్లో లాంచ్ అయ్యింది.
సేల్ అండ్ ఆఫర్స్
ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ పై రెండు లాంచ్ ఆఫర్స్ అందించింది. అవేమిటంటే, రూ. 1,000 రూపాయల Axis అండ్ ICICI బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ మరియు రెండోది రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 26,999 ధరలో లభిస్తుంది.
Moto G Max: ఫీచర్స్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ లో 6.72 అంగుళాల LCD స్క్రీన్ తో అందించింది. అయితే ఈ స్క్రీన్ FHD + రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1050 HBM బ్రైట్నెస్ తో ఉంటుంది. అందుకే, ఇందులో వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ శాటిన్ ఇన్స్పైర్డ్ ఫినిష్ తో చాలా ప్రీమియం గా ఉంటుంది.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon 6s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లో అందించిన 6GB LPDDR 5X ర్యామ్, 12GB ర్యామ్ బూస్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ MIL-STD 810H ఫీచర్ మంచి డ్యూరబిలిటీ కూడా కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది మరియు 2 OS అప్డేట్ మరియు 3 సంవత్సరాల అప్డేట్స్ అందుకుంటుంది.
ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP Sony LYTIA 600 మెయిన్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 32MO సెల్ఫీ కెమెరా ఉంటాయి. అయితే, ఈ ఫోన్ కేవలం 2K వీడియో సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటుంది. కానీ, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు మోటోరోలా యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
