Independence Day 2026 Special: బ్లాక్ అండ్ వైట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలను AI టెక్నాలజీతో సహజమైన కలర్ ఇమేజ్‌లుగా ఎలా మార్చాలి.!
సమరయోధుల పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను సహజమైన కలర్ ఫోటోలుగా మార్చడం చాలా సులభం
Artificial Intelligence (AI) టెక్నాలజీ సహాయంతో ఈ పని చేయడం చాలా సులభం అయ్యింది
పాత ఫోటోలను సహజమైన రంగులతో కూడిన కలర్ ఇమేజ్‌లుగా మార్చుకోవచ్చు
Independence Day 2026 Special: మన స్వాతంత్ర్య సమరయోధుల పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను సహజమైన కలర్ ఫోటోలుగా మార్చడం చాలా సులభం. ఆధునిక Artificial Intelligence (AI) టెక్నాలజీ సహాయంతో ఈ పని చేయడం చాలా సులభం అయ్యింది. పాత ఫోటోలను సహజమైన రంగులతో కూడిన కలర్ ఇమేజ్‌లుగా మార్చుకోవచ్చు. ఈ టెక్నాలజీ పాత ఫోటోలకు కొత్త రూపాన్ని ఇవ్వడమే కాకుండా, వారి చరిత్రను కూడా యువతకు మరింత ఆసక్తికరంగా పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది.
SurveyAI ఫోటో కలరైజేషన్ అంటే ఏమిటి?
పాత ఫోటోలో సాధారణంగా రంగుల సమాచారం ఉండదు. ఫోటోలోని ముఖం, దుస్తులు, చర్మ ఛాయ మరియు బ్యాగ్రౌండ్ వంటి అంశాలను AI విశ్లేషించి, వాటికి సరిపోయే సహజమైన రంగులు అంచనా వేసి జోడిస్తుంది. దీనినే AI Photo Colorization అంటారు. ఈ లేటెస్ట్ టెక్ తో AI మోడల్స్ వేలాది లేదా లక్షలాది కలర్ ఫోటోలపై శిక్షణ పొందడం ద్వారా, ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో ఏ ప్రాంతానికి ఎలాంటి రంగు సరిపోతుందో అంచనా వేయగలుగుతాయి. తద్వారా, ఆ ఫోటోలను చాలా సహజసిద్ధమైన ఇమేజ్ గా రూపొందించి అందిస్తాయి.
ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోలను కలర్‌లోకి ఎలా మార్చాలి?
ఈ ప్రక్రియ చాలా సులభం. ముందుగా మంచి నాణ్యత కలిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ఎంచుకోవాలి. ఈ ఫోటో ఎంత స్పష్టంగా ఉంటుందో AI అంత మరింత మెరుగైన ఫోటోలు అందిస్తుంది. ఇది స్కాన్ చేసిన లేదా డౌన్ లోడ్ చేసిన ఫోటో అయినా సరే కలర్ ఫోటో గా మారుస్తుంది.
దీనికోసం ముందుగా AI colorization లేదా photo restoration టెక్నాలజీ ఉన్న ఏఐ టూల్ లో ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ఏఐ టూల్ ఈ ఇమేజ్ ని పూర్తిగా పరికిస్తుంది.ఇది ముఖ లక్షణాలు, స్కిన్ టోన్, జుట్టు, దుస్తులు, బ్యాక్ గ్రౌండ్, లైటింగ్ మరియు వస్తువులు వంటి అన్ని విషయాలను అంచనా వేస్తుంది.

సాధారణంగా అందరూ కూడా ఇమేజ్ అప్ లోడ్ చేసిన తర్వాత జస్ట్ ‘colorize this image’ అని టైప్ చేసి కమాండ్ ఇస్తుంటారు. అయితే, మరింత స్పష్టమైన prompt ఇవ్వడం ద్వారా మరింత ఉన్నమైన ఇమేజ్ అందుకోవచ్చు.

ఉదాహరణకు: “Restore and naturally colorize this historical black-and-white photograph. Preserve the person’s original facial features, expression, clothing, pose and identity. Use realistic Indian skin tones, natural fabric colors, authentic historical lighting and subtle colors. Do not change the face or add modern elements. Create a realistic, documentary-style color photograph.”
ప్రాంప్ట్ తో చాలా స్పష్టమైన ఇమేజ్ ను అందుకోవచ్చు. ఫోటోను మార్చేటప్పుడు ఏ విషయాలు తప్పకుండా కాపాడాలో ఇలాంటి ప్రాంప్ట్ ఏఐ టూల్ కి స్పష్టంగా చెబుతుంది.
సహజమైన కలర్ ఎందుకు ముఖ్యం?
చారిత్రక వ్యక్తుల ఫోటోలు కలర్ చేయడంలో ప్రధాన లక్ష్యం కొత్త వ్యక్తిని సృష్టించడం కాదు. అసలు ఫోటోలో ఉన్న వ్యక్తి రూపం, ముఖ కవళికలు, దుస్తులు, భంగిమలు వీలైనంత వరకు అలాగే ఉంచుతూ రంగులను మాత్రమే సహజంగా జోడించడం. అందుకే, అందుకే చాలా ఎక్కువ saturation, artificial skin tones లేదా modern-looking backgrounds ఉపయోగించకుండా తగిన మరియు సహజమైన కలర్స్ ఎంచుకోవాలి.
Also Read: PHILIPS 55 QLED Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ .. టీవీని బడ్జెట్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.!
Independence Day 2026 special : ఈ టెక్నాలజీ ఎందుకు ప్రత్యేకం?
స్వాతంత్ర్య సమరయోధుల గురించి చదవడం ఒక అనుభూతి. కానీ వారి కాలం నాటి ఫోటోలను ఆధునిక టెక్నాలజీతో సహజమైన రంగుల్లో చూడటం మరో అనుభవం అవుతుంది. AI సహాయంతో పాత చారిత్రక ఫోటోలను యువతకు మరింత ఆకర్షణీయంగా ప్రదర్శించవచ్చు.
AI చరిత్రను మార్చదు, దానికి బదులు చరిత్రను మనకు కొత్తగా చూపించే ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
