ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అతి చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఎప్పుడూ చూడనంత చవక ధరలో రోజు సేల్ అవుతుంది

SASA LELE నుంచి అందించిన భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ అతి తక్కువ ధరలో లభిస్తుంది

ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ 20 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఎప్పుడూ చూడనంత చవక ధరలో రోజు సేల్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన SASA LELE నుంచి అందించిన భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ 18 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

జెబ్రోనిక్స్ గత సంవత్సరం అందించిన ప్రీమియం సౌండ్ బార్ Juke Bar 10000 పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. అందుకే, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు అతి చవక ధరలు లభిస్తుంది. ఇక డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ గత సంవత్సరం రూ. 44,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 12,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 32,998 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది.

ఇంతటితో ఈ సౌండ్ బార్ పై అందించిన ఆఫర్స్ లిస్ట్ అయిపోలేదు సుమ. ఈ సౌండ్ బార్ పై మరో రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 4,000 అదనపు డిస్కౌంట్ మరియు రూ. 1,750 రూపాయల అదనపు SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ అన్ని ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 27,248 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

Also Read: వివో పవర్ ఫుల్ ఫోన్ Vivo X200T పై ఫ్లిప్ కార్ట్ సేల్ అద్భుతమైన ఆఫర్స్ అందుకోండి.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ కంప్లీట్ సరౌండ్ అందించే 7.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 1100W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బీర్ లో వచ్చే బార్ లో పైన రెండు, సైడ్ లో రెండు మరియు ముందు మూడు స్పీకర్ కలిగిన బార్ ఉంటుంది. దీనికి జతగా ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ కూడా కలిగి ఉంటుంది. ఈ మొత్తం సెటప్ తో డీప్ అండ్ జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే 300W సబ్ ఉఫర్ కూడా ఉంటుంది.

ఈ సౌండ్ బార్ ప్రీమియం సౌండ్ అందించే టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ మరియు DTS : X సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ Zeb Acoustic max మల్టీ డైమెన్షనల్ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :