Boat launches CineHead M1 and E1 Smart Projector under budget price
ప్రముఖ భారతీయ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Boat కేవలం బడ్జెట్ ధరలో రెండు 150 ఇంచ్ Smart Projector రిలీజ్ చేసింది. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న చాలా ప్రొజెక్టర్ పోటీగా ఈ కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ ని అందించింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ఆటో ఫోకస్ మరియు ఆటో కీస్టోన్ వంటి ఫీచర్స్ తో పాటు Honest 200 ANSI Lumens పవర్ ఫుల్ లైట్ తో వచ్చింది.
బోట్ ఈ కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ లలో ఒకదానిని Cine Head M1 పేరుతో రిలీజ్ చేసింది. మంచి ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 10,999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పై భారీ డీల్ కూడా అందించింది. స్మార్ట్ ప్రొజెక్టర్ ను ఏదైనా బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 1,000 డిస్కౌంట్ అందిస్తుంది. అంటే, ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ కేవలం రూ. 9,999 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రొజెక్టర్ ను అమెజాన్ మరియు బోట్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ చేస్తోంది. Buy From Here
ఇక రెండో ప్రొజెక్టర్ విషయానికి వస్తే, దీనిని Cine Head E1 పేరుతో రిలీజ్ చేసింది. ఈ ప్రొజెక్టర్ ని కేవలం రూ. 7,499 ప్రైస్ ట్యాగ్ తో రిలీజ్ చేసింది. ఇది కూడా అమెజాన్ మరియు బోట్ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. Buy From Here
Also Read: Tecno Pop X 5G: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఇక ఈ రెండు ప్రొజెక్టర్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ రెండు కూడా గరిష్టంగా 150 ఇంచ్ బిగ్ స్క్రీన్ వరకు ఆఫర్ చేస్తాయి. అయితే, సినీ హెడ్ M1 ప్రొజెక్టర్ నేటివ్ 1080P రిజల్యూషన్, హానెస్ట్ 200 ANSI లుమెన్స్ లైట్ కలిగి ఉంటే, సినీ హెడ్ E1 ప్రొజెక్టర్ 720P రిజల్యూషన్ మరియు హానెస్ట్ 150 ANSI లుమెన్స్ లైట్ సపోర్ట్ తో వస్తుంది.
సినీ హెడ్ M1 ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 12 తో పని చేస్తుంది మరియు సినీ హెడ్ E1 ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ 13 OS పై నడుస్తుంది. ఈ రెండు ప్రొజెక్టర్ లు కూడా Netflix, Prime Video, YouTube వంటి ప్రీ ఇంస్టాల్ యాప్స్ తో వస్తాయి. అయితే, M1 ప్రొజెక్టర్ ఆటో కీస్టోన్ కరెక్షన్ మరియు ఆటో ఫోకస్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ లు HDMI, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి.