Tecno Pop X 5G: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
టెక్నో ఈరోజు తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.
Tecno Pop X 5G ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించింది
ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది
టెక్నో ఈరోజు ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే టెక్నో పాప్ ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో ఉంటుంది మరియు బిగ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
SurveyTecno Pop X 5G : ప్రైస్
టెక్నో ఈ ఫోన్ ను రూ. 15,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లూ మరియు రిప్పల్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఏప్రిల్ ఈ నాలుగవ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు టెక్నో అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
Tecno Pop X 5G : ఫీచర్స్
టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ను MIL-STD 810H సర్టిఫైడ్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో చాలా స్ట్రాంగ్ డిజైన్ తో చాలా అందించింది. ఇది 1.5 మీటర్ల ఎత్తు నుంచి కింద పడినా కూడా నష్టం జరగకుండా తట్టుకునే శక్తి కలిగి ఉంటుందని టెక్నో తెలిసింది. ఇది 6.78 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ మరియు 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

టెక్నో ఈ స్మార్ట్ ఫోన్ ని మీడియాటెక్ Dimensity 6400 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దీనికి జతగా 6 జీబీ ఫిజికల్ ర్యామ్ జతగా 12 జీబీ వర్చువల్ తో టోటల్ 18GB ర్యామ్ ఫీచర్ మరియు 128 జీబీ వరకు స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సూపర్ స్లీక్ డిజైన్ లో కూడా 6500 mAh భారీ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Apple CEO పదవికి రాజీనామా చేసిన Tim Cook: కొత్త సీఈఓ గా John Ternus
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile