boAt బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ ను లాంచ్ చేసింది:ధర ఎంతంటే?

HIGHLIGHTS

boAt తన Dolby Atmos సౌండ్ బార్ ను విడుదల చేసింది.

ఈ సౌండ్ బార్ boAt AAVANTE Bar 4000DA పేరుతొ లాంచ్

బడ్జెట్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా ప్రకటించింది.

boAt బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ ను లాంచ్ చేసింది:ధర ఎంతంటే?

ప్రముఖ ఆడియో ప్రోడక్ట్ బ్రాండ్ boAt తన Dolby Atmos సౌండ్ బార్ ను విడుదల చేసింది. సరికొత్తగా బోట్ ప్రవేశపెట్టిన ఈ సౌండ్ బార్ కేవలం డాల్బీ అట్మోస్ తో పాటుగా మల్టి కనెక్టివిటీ మరియు 200W హెవీ సౌండ్ ను కూడా అందిస్తుంది. ఇక ధరను కూడా బడ్జెట్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా ప్రకటించింది. మరింకెదుకు ఆలశ్యం ఈ boAt సౌండ్ బార్ విశేషాలేమిటో  చూసేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt AAVANTE Bar 4000DA:ధర

boAt యొక్క ఈ Dolby Atmos 3D సౌండ్ బార్ కేవలం రూ.14,999 రుపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది. ఫిబ్రవరి 20 నుండి, అంటే రేపటి నుండి Flipkart లో అమ్మకాలను సాగించనుంది.        

boAt AAVANTE Bar 4000DA Dolby Atmos  సౌండ్ బార్ ప్రత్యేకతలు

BoAt AAVANTE Bar 4000DA స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే, ఇది 2.1.2 సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ మైన్ యూనిట్ లో నాలుగు 2.24 ఇంచ్   స్పీకర్లు, రెండు 2 ఇంచి స్పీకర్లు వున్నాయి. ఇక సబ్ ఉఫర్ పెద్ద 6.5 ఇంచ్ ఉఫర్ ని కలిగి ఉంటుంది. మొత్తంగా,  ఈ AAVANTE Bar 4000DA సౌండ్ బార్ సౌండ్ 7 స్పీకర్లను కలిగి ఉంటుంది మరియు టోటల్ గా 200W RMS పవర్ ఫుల్ సౌండ్ ని అందిస్తుంది.

ఈ boAt సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా కూడా మంచి అప్షన్ లతో వస్తుంది. ఈ సౌండ్ బార్, HDMI ARC, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. అయితే, మీ సెటప్ బాక్స్ లేదా మీడియా ప్లేయర్ లేదా Dongel తో నేరుగా కనెక్షన్ కోసం Pass-Through కనెక్టివిటీ ను కూడా కలిగి వుంది.                                        

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo