boAt Airdopes Prime 701: హైబ్రిడ్ ANC మరియు 50 గంటల బ్యాటరీతో లాంచ్.!
భారత మార్కెట్లో బోట్ కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది
boAt Airdopes Prime 701 బడ్స్ ను హైబ్రిడ్ ANC మరియు 50 గంటల బ్యాటరీతో లాంచ్ చేసింది
బోట్ యాప్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది
boAt Airdopes Prime 701: భారత మార్కెట్లో బోట్ కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను హైబ్రిడ్ ANC మరియు 50 గంటల బ్యాటరీతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఆకట్టుకునే డిజైన్ మరియు ANC ఫీచర్ తో పాటు బోట్ యాప్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
boAt Airdopes Prime 701: ప్రైస్
బోట్ ఈ కొత్త బడ్స్ ను కేవలం రూ. 2,199 రూపాయల ఆఫర్ ధరకే లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను SBI క్రెడిట్ కార్డ్ తో అమెజాన్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు రూ. 200 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. జూన్ 21వ తేదీ నుంచి ఈ ఇయర్ బడ్స్ అమెజాన్ మరియు బోట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
boAt Airdopes Prime 701: ఫీచర్స్
బోట్ ఎయిర్ డోప్స్ ప్రైమ్ 701 ఇయర్ బడ్స్ ప్రీమియం డిజైన్ తో ఒడిసిడియన్ గ్రే, టైటానియం బ్లూ మరియు జింక్ వైట్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఇయర్ బడ్స్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) తో 24 బిట్ ప్రీమియం సౌండ్ సపోర్ట్ తో ఉంటుందని బోట్ తెలిపింది. ఈ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ మరియు రియల్ స్పటియల్ సౌండ్ తో వస్తుంది.
ఈ బోట్ కొత్త ఇయర్ బడ్స్ బోట్ మ్యూజిక్ యాప్ బోట్ హియరబుల్ యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 46dB పవర్ ఫుల్ హైబ్రిడ్ ANC ఫీచర్ ని కూడా బోట్ అందించింది. ఈ ఫీచర్ తో ఈ బడ్స్ బయట ధ్వనులు చెవులకు చేరకుండా చేసి క్లీన్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, AI-ENx టెక్నాలజీ తో మంచి కాల్ కాలింగ్ సౌలభ్యం కూడా అందిస్తుందని బోట్ ఈ బడ్స్ గురించి గొప్పగా చెబుతోంది.
Also Read: Oppo Reno 14 Series: ఇండియాలో కొత్త సిరీస్ ఫోన్స్ లాంచ్ కోసం సిద్ధమైన ఒప్పో.!
ఇక ఈ బడ్స్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ టోటల్ 50 గంటల ప్లే టైమ్ అందించే ఓవర్ ఫుల్ బ్యాటరీ మరియు ASAP ఛార్జ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ IPX5 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటాయి. ఈ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ సపోర్ట్, ఇన్ ఇయర్ డిటెక్షన్ మరియు డ్యూయల్ డివైజ్ స్విచ్ వంటి మరిన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది.