boAt Airdopes Loop: కొత్త రకం ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసిన బోట్.!

HIGHLIGHTS

భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ కొత్త రకం ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది

boAt Airdopes Loop ను యూజర్ చెవులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా డిజైన్ చేసింది

గొప్ప సౌండ్ కోసం ఈ బడ్స్ ఎయిర్ కండిషన్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది

boAt Airdopes Loop: కొత్త రకం ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసిన బోట్.!

boAt Airdopes Loop: ప్రముఖ`భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ ఈరోజు కొత్త రకం ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఈ బడ్స్ సాంప్రదాయ ఇయర్ బడ్స్ మాదిరిగా కాకుండా వినూత్నంగా ఉంటాయి. అంతేకాదు, యూజర్ చెవులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా ఈ బడ్స్ ను డిజైన్ చేసింది. గొప్ప సౌండ్ కోసం ఈ బడ్స్ ఎయిర్ కండిషన్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Airdopes Loop: ధర

బోట్ ఈ కొత్త ఇయర్ బడ్స్ ను రూ. 1,999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ ఎయిర్ డోప్స్ లూప్ బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్ ను సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చాయి.

boAt Airdopes Loop: ఫీచర్స్

ఈ కొత్త ఎయిర్ డోప్స్ లూప్ బడ్స్ ను ఎక్కువ సమయం ధరించినా ఎటువంటి నొప్పి లేదా డిస్ కంఫర్ట్ ఫీల్ అనిపించకుండా చేసేలా అందించింది. ఈ బడ్స్ ను కొత్త క్లిప్ ఆన్ ఫిట్ డిజైన్ తో అందించినట్లు బోట్ తెలిపింది. అంటే, ఈ బడ్స్ ను చెవిలో ఫిట్ చేసుకోవడం కాకుండా జెస్ట్ క్లిప్ లాగా తగిలించుకుంటే సరిపోతుంది.

boAt Airdopes Loop

ఇక ఈ బడ్స్ యొక్క ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ బడ్స్ 12mm స్పీకర్లు మరియు డ్యూయల్ ఈక్వలైజర్ సపోర్ట్ తో వస్తుంది. ఈ కొత్త TWS Buds బోట్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తుంది మరియు మంచి కాలింగ్ కోసం క్వాడ్ మెక్స్ Enx టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: 8 వేలకే Dolby Atmos సౌండ్ బార్ డీల్ అందించిన అమెజాన్.!

ఈ బడ్స్ బాక్స్ తో కలిపి టోటల్ 50 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. మంచి ఓపెన్ సౌండ్ అందించడానికి వీలుగా ఈ బడ్స్ లో ఎయిర్ కండీషన్ టెక్నాలజీని కూడా అందించింది. ఈ బోట్ బడ్స్ 10min ASAP ఛార్జ్ తో 200 నిముషాల ప్లేబ్యాక్ అందిస్తుందని కూడా బోట్ తెలిపింది. ఈ బడ్స్ 40ms లో లెటెన్సీ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, అని కూడా బోట్ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile