HIGHLIGHTS
లేటెస్ట్ బిగ్ 5.1 Dolby Audio సౌండ్ బార్
Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు టవర్ స్పీకర్లు
ఈ సౌండ్ బార్ మొత్తం 11 స్పీకర్లను కలిగి ఉంటుంది
లేటెస్ట్ బిగ్ 5.1 Dolby Audio సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, ఇండియన్ మర్కెట్లోకి ప్రముఖ జర్మన్ ఆడియో కంపెనీ Blaupunkt ఇండియాలో కొత్త విడుదల చేసిన SBW600 5.1 పైన ఒక లుక్ వేయండి. ఈ బ్లూపంక్ట్ ఈ సౌండ్ బార్ ను 5.1 Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు టవర్ స్పీకర్లతో తో పాటు 600W హెవీ సౌండ్ తో అందించింది. ఈ లేటెస్ట్ బ్లూపంక్ట్ సౌండ్ బార్ పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందామా.
SurveyBlaupunkt SBW600 5.1 సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్, సౌండ్ బార్ మరియు శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మొత్తం 11 స్పీకర్లను కలిగి ఉంటుంది. వీటిలో, 1 స్పీకర్ 8 ఇంచ్ పెద్ద హెవీ ఉఫర్ కాగా, మిగిలిన 10 స్పీకర్లు కూడా 2.5 ఇంచ్ స్పీకర్లు. సౌండ్ బార్ 6 స్పీకర్లను కలిగి ఉండగా, శాటిలైట్ స్పీకర్ లు ఒక్కొక్కదానిలో 2 చొప్పున మొత్తం 4 స్పీకర్లను కలిగి ఉంటాయి. సబ్ ఉఫర్ లో వున్న పెద్ద స్పీకర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ మరియు మంచి రిచ్ మరియు పవర్ ఫుల్ Bass అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
Blaupunkt SBW600 వైర్‌లెస్ సౌండ్‌బార్ రూ.18,990 ధరతో ఇండియాలో లాంచ్ చెయ్యబడింది. ఈ సౌండ్ బార్ Amazon మరియు Blaupunkt యొక్క స్వంత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ విషయానికి వస్తే, SBW600 సౌండ్ బార్ లేటెస్ట్ బ్లూటూత్, HDMI మరియు ARC ఇంటర్ ఫేస్ లతో పాటుగా AUX, USB, Optical మరియు Coaxial పోర్ట్‌లతో సహా మల్టి పుల్ కనెక్టివిటీ అప్షన్లకు సపోర్ట్ కలివుంది.