అండర్ రూ. 7,000 ధరలో 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ చెక్ చేస్తుంటే .. ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

అండర్ రూ. 7,000 ధరలో 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్

రోజు మేము అందించిన రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను పరిశీలించవచ్చు

5.1 ఛానల్ సెటప్, డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది

అండర్ రూ. 7,000 ధరలో 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ చెక్ చేస్తుంటే, ఈరోజు మేము అందించిన రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ లు ప్రీమియం డిజైన్ మరియు సౌండ్ పరంగా మంచి రివ్యూలు అందుకోవడమే కాకుండా మంచి రేటింగ్ కూడా అందుకున్నాయి. మీరు కూడా ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో జబర్దస్త్ సౌండ్ అందించే కొత్త డాల్బీ ఆడియో సౌండ్ బార్ కోసం చూస్తుంటే ఈ డీల్స్ పై ఒక లుక్కేయండి.

5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి సౌండ్ బార్స్ మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. అందుకే, ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న బెస్ట్ డీల్స్ ని ఇక్కడ అందించాము. ఇక డీల్స్ విషయానికి వస్తే, Egate మరియు GOVO యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ లు ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు డీల్స్ కంప్లీట్ ఇన్ఫో ఇప్పుడు చూద్దాం.

GOVO GO SURROUND 980

గోవో యొక్క ఈ లేటెస్ట్ 5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని మరింత బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

ఈ గోవో సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు 525w అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇది మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో పాటు డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇది మల్టీ కనెక్టివిటీ మరియు ప్రీమియం డిజైన్ తో కూడా వస్తుంది.

Also Read: boltt ACE 5G: ఆకట్టుకునే ఫీచర్స్ తో కళ్ళు చెదిరే ధరలో లాంచ్ అయ్యింది.!

Egate Phantom 630D

ఇది ప్రముఖ ప్రొజెక్టర్ బ్రాండ్ ఈగేట్ అందించిన పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 6,999 ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పైన కూడా మంచి బ్యాంక్ ఆఫర్స్ మీ ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కూడా 7 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ సాలిడ్ డిజైన్ మరియు సెటప్ తో వస్తుంది. ఇందులో కూడా డ్యూయల్ శాటిలైట్ స్పీకర్, మూడు స్పీకర్ కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది కూడా 540w సౌండ్ అవుట్ పుట్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అలాగే, HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా సౌండ్ బార్ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :