Apple Airpods 5 launched with powerful sound and anc support
Apple Airpods 5: ఈరోజు యాపిల్ ప్రత్యేకంగా నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి కొత్త ఎయిర్ పాడ్స్ 5 ని రిలీజ్ చేసింది. ఈ కొత్త పాడ్స్ ని గొప్ప సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు రెట్టించిన ANC మెరుగుదల వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ లో లైవ్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ ని కూడా జత చేసింది. మొత్తానికి ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ని గత పాడ్స్ తో పోలిస్తే మరింత మెరుగుదలతో లాంచ్ చేసింది. ఈ కొత్త యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
యాపిల్ ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ని పర్సనలైజ్డ్ స్పెషల్ ఫీచర్ తో అందించింది. ఇది యూజర్ కి అవసరమైన విధంగా మార్చుకుని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇది కాకుండా వాల్యూమ్ కంట్రోల్స్ కోసం వాల్యూమ్ స్వీప్ కంట్రోల్స్ తో అందించింది. ఈ ఫీచర్ తో ఈ బెడ్స్ ను చాలా సౌకర్యవంతంగా మార్చింది. అంతేకాదు, యాపిల్ కొత్తగా రిలీజ్ చేసిన లేటెస్ట్ Siri AI ఫీచర్ తో లాంచ్ చేసింది.