అమెజాన్ సేల్ నుంచి 4 వేలకే 300W Dolby Soundbar అందుకోండి.!

HIGHLIGHTS

అమెజాన్ ఇండియా కొత్తగా మెగా డీల్ డేస్ సేల్ ని అనౌన్స్ చేసింది

అమెజాన్ సేల్ నుంచి కేవలం 4 వేలకే 300W Dolby Soundbar ని అందుకోవచ్చు

ఈ సౌండ్ బార్ ఈరోజు లభిస్తున్న అతి చవక 300W డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది

అమెజాన్ సేల్ నుంచి 4 వేలకే 300W Dolby Soundbar అందుకోండి.!

అమెజాన్ ఇండియా కొత్తగా మెగా డీల్ డేస్ సేల్ ని అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి అనేక ప్రొడక్ట్స్ పై భారీ నుంచి అతి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ముఖ్యంగా, సౌండ్ బార్స్ పై ఈరోజు గొప్ప డీల్స్ అందించింది. అందుకే, చాలా కొత్త సౌండ్ బార్ లు కూడా ఈరోజు చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఎంత చవక ధరలో సౌండ్ బార్స్ లభిస్తున్నాయంటే, అమెజాన్ సేల్ నుంచి కేవలం 4 వేలకే 300W Dolby Soundbar ని అందుకోవచ్చు. ఈరోజు అదే బెస్ట్ డీల్ ని అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

300W Dolby Soundbar : డీల్ ఏమిటి?

ప్రొజెక్టర్ మరియు సౌండ్ బార్ లను అందించే బెస్ట్ బ్రాండ్ గా పేరొందిన E GATE అందించిన Enigma సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Enigma 315D నిన్న మొన్నటి వరకు రూ. 5,499 రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, అమెజాన్ ఈరోజు ఈ సౌండ్ బార్ పై రూ. 1,257 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించి కేవలం రూ. 4,242 ధరకే సేల్ చేస్తోంది.

E GATE 300W Dolby Soundbar deal on amazon

ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ దెబ్బకు ఇంత చవక ధరలో 300W డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వచ్చే ఏకైక సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. Buy From Here

Also Read: Xiaomi S Mini LED సిరీస్ నుండి కొత్త Smart Tv లాంచ్: ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!

E GATE 300W Dolby Soundbar : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ తో పొడవుగా ఉంటుంది మరియు ఇందులో 2 ప్రీమియం స్పీకర్లు ఉంటాయి. దినికి జతగా 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ కూడా ఈ సౌండ్ బార్ తో వస్తుంది. ఇది మ్యూజిక్, మూవీస్, న్యూస్ మరియు 3D అనే నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది.

ఇక సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రిసీవ్ చేసే సిగ్నల్ ను మరింత గొప్పగా మలిచి గొప్ప బాస్ మరియు క్వాలిటీ సౌండ్ అందించడానికి వీలుగా DSP (డిజిటల్ సిగ్నల్ ప్రోసెస్) చిప్ కూడా ఈ సౌండ్ బార్ లో ఉంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో AUX, ఆప్టికల్, HDMI (ARC) మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ ఈరోజు లభిస్తున్న అతి చవక 300W డాల్బీ ఆడియో సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. ఇది అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo