Whatsapp: ఈ అప్ కమింగ్ ఫీచర్లతో మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్

Whatsapp: ఈ అప్ కమింగ్ ఫీచర్లతో మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్
HIGHLIGHTS

5 కొత్త ఫీచర్లను వాట్సాప్ యాప్ కి జతచేయనుంది

మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్

వాట్సాప్ గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్ కోసం పనిచేస్తోంది

Whatsapp మరింత సౌకర్యవంతమైన యూజర్ ఎక్స్ పీరియన్స్ ను తన కస్టమర్లకు అందించడానికి మరొక 5 కొత్త ఫీచర్లను వాట్సాప్ యాప్ కి జతచేయనుంది.  ఈ అప్ కమింగ్ ఫీచర్లలో కొన్ని ఫీచర్లు ఇప్పటికే బీటా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి మరియు మరికొన్ని ఫీచర్లు డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే, ఈ 5 ఫీచర్లు కూడా రానున్న కొద్దీ కాలంలోనే వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మరి త్వరలో రానున్న వాట్సాప్ అప్ కమింగ్ 5 ఫీచర్ల గురించి చూద్దాం..!

 1. వాట్సాప్ వాయిస్ నోట్స్ ఫీచర్

వాట్సాప్ గ్లోబల్ వాయిస్ మెసేజ్ ప్లేయర్ కోసం పనిచేస్తోంది. దీని వలన మీరు వాట్సాప్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా వాయిస్ మెసేజ్ లను మీరు వినవచ్చు. అంతేకాదు, వాయిస్ మెసేజ్ లను ఎప్పుడైనా యూజర్లు Pause చేయవచ్చని కూడా వచ్చని WaBetaInfo తెలిపింది.

2. మెసేజ్ రియాక్షన్ ఫీచర్

వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ కోసం కూడా పనిచేస్తోంది. అదే, మెసేజ్ రియాక్షన్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా వచ్చిన మెసేజ్ లకు ఎమోజీల పంపడం ద్వారా రియాక్ట్ కావచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీకు కావాల్సిన మెసేజ్ ని నొక్కిపట్టుకావాలి, తరువాత అక్కడ కనిపించే ఎమోజీల్లో తగిన ఎమోజీ ఎంచుకోవచ్చు.

3. కొత్త ప్రైవసీ సెట్టింగ్స్

వినియోగదారులకు మెరుగైన సెక్యూరిటీ అందివ్వడానికి వాట్సాప్ కొత్త ప్రైవసీ సెట్టింగ్స్ కోసం పనిచేస్తోంది. నిర్దిష్ట కాంటాక్ట్స్ నుండి మీ స్టేటస్ అప్డట్స్, ప్రొఫైల్ పిక్చర్ మరియు లాస్ట్ సీన్ ఇన్ఫర్మేషన్ వంటి వాటిని Hide( దాచడం) కోసం కొత్త ప్రైవసీ సెట్టింగ్స్ ను అందిచనుంది.

4. మెరుగైన బ్యాకప్ ఫీచర్

WabetaInfo ప్రకారం, వాట్సాప్ క్లౌడ్‌కు యూజర్లు బ్యాకప్ చేయదలిచిన డేటాను ఎంచుకోవడానికి యూజర్లను అనుమతించే 'మేనేజ్ బ్యాకప్ సైజ్' ఫీచర్‌ కోసం కూడా పనిచేస్తోంది. మీ డ్రైవ్ లో ఎక్కువ స్థలాన్ని కేటాయించకుండా ఉండడాని వీలుగా కేవలం యూజర్లు పెద్ద ఫైల్స్ ను మినహాయించవచ్చు.

5. కొత్త చాట్ బబుల్స్

యూజర్స్ చాటింగ్ ను గుండ్రని బ్రైట్ బబుల్స్ రూపంలో చూపేవిధంగా కొత్త వాట్సాప్ కొత్త చాట్ బబుల్స్ ఫీచర్ ను  తీసుకువస్తోంది. వాస్తవానికి, WhatsApp ఇటీవల iOS ప్లాట్‌ఫామ్‌లోని బీటా వినియోగదారుల కోసం కొత్త వెర్షన్ 2.21.200.11 ని విడుదల చేసింది. ఈ బీటా వెర్షన్ నుండి కొత్త చాట్ బబుల్స్ ఫీచర్ ను జతచేసింది. అంటే iOS ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo