ఆండ్రాయిడ్ ఫోనులకు మైక్రోసాఫ్ట్ కొత్త లాంచర్ యాప్

ఆండ్రాయిడ్ ఫోనులకు మైక్రోసాఫ్ట్ కొత్త లాంచర్ యాప్
HIGHLIGHTS

బీటా వెర్షన్

నిన్న మైక్రోసాఫ్ట్ beta వెర్షన్ లాంచర్ ను ఆండ్రాయిడ్ ఫోనులకు విడుదల చేసింది. దీని పేరు Arrow. ఇంటరెస్ట్ ఉన్న వాళ్లు Arrow Launcher Beta యొక్క Google + గ్రూప్ లో జాయిన్ అయ్యి రిక్వెస్ట్ సబ్మిట్ చేయటం(మీరు మీ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేయటానికి) లేదా apk డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని దీనిని ట్రై చేయగలరు.

గతంలో ఆండ్రాయిడ్ లో Next lock screen ను లాంచ్ చేసింది కంపెని. Arrow లాంచర్ లో 3 స్క్రీన్స్ ఉన్నాయి. వాటిని రిమూవ్ లేదా add చేసుకోవచ్చు.

 

left స్క్రీన్ మోస్ట్ రీసెంట్ కాంటాక్ట్ లిస్ట్ ఉంటుంది. మిడిల్ హోం స్క్రీన్, మూడవ స్క్రీన్ లో నోట్స్, రిమైండర్స్, To-do లిస్ట్స్. Customization పరంగా ఇది కొంచెం limited గా ఉంది. ఐకాన్ ప్యాక్స్ మరియు సైజెస్ ను మార్చటానికి వీలు లేదు.

దీని హోం స్క్రీన్ లో రీసెంట్ యాప్ డాక్ మరియు ఫ్రీక్వెంట్ గా వాడబడే యాప్స్ గ్రిడ్ arrangement ఫీచర్స్ ఉన్నాయి.  కాంటాక్ట్స్ మరియు యాప్స్ రెండూ customize చేసుకోగలరు. బీటా ప్రోగ్రాం లో జాయిన్ అవటం ఇష్టం లేని వాళ్లు యాప్ ను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేసుకోండి.

అయితే విడిగా ఉండే ఈ apk ఫైల్ ను ఇంస్టాల్ చేసుకోవాలంటే ముందు మీ ఆండ్రాయిడ్ ఫోనులో Settings లో Security ఆప్షన్ లో Unknown Sources అనే ఆప్షన్ ను enable చేసుకోవాలి. ఇది ప్లే స్టోర్ నుండి కాకుండా బయట విడిగా దొరకే ఆండ్రాయిడ్ యాప్స్ (apk ఫైల్స్) ను ఇంస్టాల్ చేయటానికి ఫోనుకు మీరు ఇచ్చే అనుమతి.

Souvik Das

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo