మేరా రేషన్ యాప్ తో మీ రేషన్ కార్డ్ సర్వీస్ మీ చేతిలోనే

మేరా రేషన్ యాప్ తో మీ రేషన్ కార్డ్ సర్వీస్ మీ చేతిలోనే
HIGHLIGHTS

ప్రభుత్వం కొత్త APP లాంచ్ చేసింది.

దగ్గరలోని రేషన్ షాప్ వివరాలను పొందవచ్చు

ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది

దేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రేషన్ లభిధారుల కోసం ప్రభుత్వం కొత్త APP లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా రేషన్ లభిధారులు దేశంలో ఎక్కడినుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లభిధారుల దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికి రేషన్ అందేలా చూసేందుకు ప్రభుత్వం ఈ 'మేరా రేషన్' మొబైల్ యాప్ ను లాంచ్ చేసినట్లు తెలిపింది.

 మేరా రేషన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్లే స్టోర్ నుండి అందుబాటులో వుంది మరియు దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ దగ్గర్లోని రేషన్ షాప్ వివరాలను తెలుసుసుకోవడమే కాకుండా రేషన్ సామునుల ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.      

 మేరా రేషన్ మొబైల్ యాప్

ఈ యాప్ ను ఉపయోగించాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయాలి. అందుకే, ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ నుండి మేరా రేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత,  మీ రేషన్ కార్డు నంబర్ తో రిజిష్టర్ చేసుకోవాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo