ఇంస్టాగ్రామ్ లో మరిన్ని ఏడ్స్

ఇంస్టాగ్రామ్ లో మరిన్ని ఏడ్స్
HIGHLIGHTS

ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ను కొనేసింది, ఇప్పుడు ఎక్కువ ఏడ్స్ ను ఆప్ లో అమ్మనుంది.

ఈ మధ్య కాలంలో నే ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ ను కొనటం జరిగింది. అప్పటి నుండి ఇంస్టాగ్రామ్ లో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, అప్లికేషన్ లో మరిన్ని ఏడ్స్ ను చూపించనుంది ఫేస్బుక్.

ఇంతే కాక ఇంస్టా గ్రామ్ లో ఫేస్బుక్ ఇంటిగ్రేషన్ ను పెంచేందుకు ప్రయత్నిస్తుంది అని ఇంస్టాగ్రామ్ చెబుతుంది. ఇంస్టాగ్రామ్ యూజర్స్ అభిరుచులకు తగ్గట్టుగా వారికి ఏడ్స్ ను చూపిస్తామని చెబుతున్నారు. వాళ్లు చూసే ఏడ్స్ కు ఫీడ్ బ్యాక్ ను కూడా ఇచ్చే విధంగా ఎక్కువ ఆప్షన్స్ ను జోడిస్తాము అని చెప్పారు ఇంస్టాగ్రామ్ డెవెలప్ టీమ్.

యూజర్స్ కు వాళ్ళ దగ్గరిలో ఉన్న క్లోతింగ్ మరియు ఫుడ్ రెస్టారెంట్స్ గురించి తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడ్తుంది, అలాగే అన్ని రకాల బిజినెస్ లకు కస్టమర్స్ ను పెంచుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ టీమ్. ఇప్పటికే ఫేస్బుక్ లో రెండు మిలియన్ల ఎడ్వేర్టైజర్స్ ఉన్నారు. అదే మార్కెట్ ను ఇంస్టా గ్రామ్ కు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుంది ఫేస్బుక్. ఒక విధంగా ఇది ఆప్ ను వాడే యూజర్స్ కు ఇబ్బంది కరంగా ఉండదు, బిజినెస్ లకు, యూజర్స్ కు ఉపయోగాలు ఉంటాయి.

అయితే ఫేస్బుక్ లో ఉన్నంత స్రుతి మించిన ఏడ్స్  ఇంస్టాగ్రామ్ లో జోడించకుండా ఉంటే ఇంస్టాగ్రామ్ వినియోగదారుల నుండి సపోర్టివ్ ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 

Digit.in
Logo
Digit.in
Logo